రేర్‌ రికార్డ్‌ : పుష్ప స్టార్‌

ఫహద్ ఫాసిల్ ఆ పాత్రను పోషించడం వల్ల వెయిట్‌ పెరిగింది అనడంలో సందేహం లేదు.

Update: 2024-05-04 08:57 GMT

అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాలో మలయాళ స్టార్‌ నటుడు ఫహద్ ఫాసిల్‌ పోషించిన భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ పాత్రకు మంచి గుర్తింపు లభించింది. సినిమాలో ఆ పాత్ర కనిపించింది కొద్ది సమయం అయినా కూడా అందరి దృష్టిని ఆకర్షించడంలో కీలప పాత్ర పోషింది. ఫహద్ ఫాసిల్ ఆ పాత్రను పోషించడం వల్ల వెయిట్‌ పెరిగింది అనడంలో సందేహం లేదు.

మలయాళ నటుడు అయిన ఫహద్‌ ఫాసిల్‌ ఇతర భాషల్లో ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. మలయాళంలో హీరోగా కొన్ని సినిమాలు చేసినా కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలను పొందలేక పోయాడు. అయినా కూడా హీరోగా ప్రయత్నాలు కొనసాగిస్తూ తాజాగా 'ఆవేశం' అనే సినిమాలో నటించాడు.

గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆవేశం సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ హిట్ గా నిలిచింది. మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి ఈ మధ్య కాలంలో వరుసగా భారీ బ్లాక్ బస్టర్ లు వస్తున్నాయి. వాటన్నింటిని మించి ఈ సినిమా ఉందంటూ వచ్చిన కలెక్షన్స్ ను చూస్తే అర్థం అవుతుంది.

నాలుగు వారాలు కూడా పూర్తి కాకుండానే ఈ సినిమా ఏకంగా రూ.150 కోట్లను వసూళ్లు చేసింది. త్వరలో ఓటీటీ స్ట్రీమింగ్‌ కి రెడీ అవుతున్న ఈ సినిమా ఇంకా కూడా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ స్థాయి వసూళ్లు దక్కించుకున్న ఫహద్‌ ఫాసిల్‌ కెరీర్ లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ ను దక్కించుకుని రేర్‌ రికార్డ్‌ ను సొంతం చేసుకున్నాడు.

ఆవేశం సూపర్ హిట్ అయిన నేపథ్యంలో పుష్ప 2 కి మలయాళంలో మరింత క్రేజ్‌ పెరిగే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 1 తో పోల్చితే పుష్ప 2 సినిమా లో ఫాసిల్‌ కి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న పాత్ర లభించినట్లుగా తెలుస్తోంది. బన్నీ తో ఢీ కొట్టే సన్నివేశాలు సినిమా కు కీలకంగా ఉంటాయని సమాచారం అందుతోంది.

Tags:    

Similar News