పుష్ప షెకావత్.. దాని గురించి మాట్లాడకపోవడమే బెటర్
కానీ, అంచనాలకు రివర్స్ గా పుష్ప రెండో భాగంలో మాత్రం షెకావత్ పాత్రను చాలా బలహీనంగా చేసేశారు.;
మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్ లీడ్ యాక్టర్, సపోర్టింగ్ రోల్స్, విలన్ పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఆయన మలయాళం మాత్రమే కాకుండా తమిళ్, తెలుగు సినిమాల్లోనూ పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఆయన నటించిన సినిమాల్లో తెలుగు ప్రేక్షకుేలకు అత్యంత దగ్గరైన పాత్ర పుష్పలోని భన్ వర్ సింగ్ షెకావత్.
అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఫాహద్ పవర్ ఫుల్ పోలీసు అధికారి పాత్రలో కనిపించారు. రెండో పార్ట్ లోనూ ఆయన పాత్ర ఉంది. దీంతో ఇందులోనూ ఆయన పాత్ర పవర్ఫుల్ గా ఉంటుదని ఆశించారు. తొలి పార్ట్ క్లైమాక్స్ లో షెకావత్ ను ఫవర్ఫుల్ గా చూపించారు. దీంతో రెండో భాగంలోనూ పుష్ప రాజ్- షెకావత్ మధ్యలో హీటెడ్ సీన్స్ ఉంటాయని, అతడిని పుష్ప ఎలా ఢీకొంటాడోనని ప్రేక్షకులు అంచనాలు పెంచుకున్నారు.
కానీ, అంచనాలకు రివర్స్ గా పుష్ప రెండో భాగంలో మాత్రం షెకావత్ పాత్రను చాలా బలహీనంగా చేసేశారు. ఒకట్రెండు సన్నివేశాలు మినహా షెకావత్ పాత్రకు కథలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో పోలీసు అయినప్పటికీ హీరో పాత్రను ఎలివేట్ చేసేందుకు ఫాహద్ క్యారెక్టర్ ను తగ్గించారనే అభిప్రాయం సినీ ప్రేక్షకుల నుండి వెలువడింది.
ఈ సీక్వెల్ లో తన పాత్రలో పస లేదని ఫాహద్ కూడా గతంలో అంగీకరించారు. ఇందులో తన పాత్ర పట్ల నిరాశ చెందినట్లు చెప్పారు. అందుకేనేమో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన ఎక్కడా పాల్గొనలేదు. అయితే మరోసారి ఈ సినిమా పేరును ప్రస్తావించకుండా ఫాహద్.. ఓ భారీ సినిమాలో తన పాత్ర ఫెయిల్ అయ్యిందని చెప్పారు.
గతేడాది ఓ పెద్ద సినిమాలో పాత్రతో నేను ఫెయిల్ అయ్యాను. అయితే నేను ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడదల్చుకోలేదు. ఏదైనా మన చేతుల్లో లేనిదాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. వదిలేయాలి. ఇలాంటి వాటి నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి. అని ఫాహద్ పుష్ప 2 సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడారు.
ప్రస్తుతం సౌత్ ఇండియాలో బిజీయెస్ట్ యాక్టర్స్ లో ఫాహద్ ఒకరు. మలయాళం లోనే కాకుండా ఆయన తమిళం, తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నారు. అలాగే ఫారితోషికం కూడా ఆయన భారీగానే అందుకుంటున్నారు.