హీరో ఆరాధనతో యువత నాశనం!
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో హీరోలపై అభిమానం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.అభిమాన హీరోని చూడటం కోసం ఎంతో దూరం నుంచి వస్తుంటారు.;
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో హీరోలపై అభిమానం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.అభిమాన హీరోని చూడటం కోసం ఎంతో దూరం నుంచి వస్తుంటారు. హీరో బాగుండాలని..మంచి విజయాలు అందించాలని పాదయాత్రలు చేస్తారు. పాలాభిషేకం చేస్తారు. ఈ మధ్య కాలంలో రక్తాభిషేకం కూడా చేస్తున్నారు. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అయ్యాయి. ఒకప్పుడు అభిమానం పేరుతో కటౌట్లు కట్టడం..జేబులో డబ్బులు తీసి సినిమాలాం డించేవారు. ఇప్పుడు అభిషేకాలు అన్నది వాటికి అప్ డెటెడ్ వెర్షన్ గా మారింది.
ప్రాణాలు సైతం లెక్క చేయకుండా:
హీరోలను చూడటానికి వచ్చి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారెంతో మంది. హీరోలు అప్పుడప్పుడు హెచ్చరిస్తున్నా? అభిమానం హద్దులు దాటుతూనే ఉంది తప్ప! అదుపులోకి రాలేదు. ఇది చాలదా? సమాజంలో సినిమాల ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి. వెండి తెరపై నటుడు కనిపిస్తే అతడే రియల్ హీరో అన్న భ్రమ నుంచి చాలా మంది అభిమానులు ఇంకా బయటకు రాలేదు. డిజిటల్ యుగంలో ఉన్నా? అభిమానానికి ఆ యుగం అంటే ? ఏంటో తెలియదన్నట్లే కనిపిస్తోంది అనడానికి ఎన్నో సంఘటనలు ఉదాహరణలు.
బాల్య దశ నుంచే హీరో ఆరాధన:
తాజాగా ఇవే అంశాలను స్పృశిస్తూ సామాజికవేత్త, న్యాయవాది భానుప్రసాద్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన ఓ లేఖ సంచలనంగా మారింది. హీరో అనే పదం డ్రగ్ కంటే ప్రమాదకరమైందని, ఇలాంటి పదాలు వాడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. హీరో ఆరాధన వల్ల బాల్య దశ నుంచే యువత భవిష్యత్ కు నష్టం కలుగుతుందన్నారు. సినిమాలో నటించే వారు హీరోలకు బధులుగా లీడ్ యాక్టర్ , లీడ్ యాక్టెర్స్ గా సంబోంధించాలన్నారు.
సైనికులు, రైతులు కంటే గొప్ప వారా?
విద్యార్దులు హైస్కూల్ స్థాయి నుంచే హీరో పాత్రలకు ఆరాధ్యులుగా మారుతు న్నారన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికులు కంటే, దేశానికి అన్నం అందించే రైతు కంటే, జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల కంటే హీరోలను పిల్లలు గొప్పగా భావిస్తున్నారన్నారు. నటులు పారితోషికం పెరుగుతోన్న నేపత్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలన్నారు. సినిమా టికెట్ ధరల నుంచి స్నాక్స్ ధరల వరకూ అన్నీ నియంత్రణలో ఉండేలా ప్రభుత్వం తగని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు.