స్టార్ హీరోలైనా త‌గ్గేదేలే!

ఒకప్పుడు సినిమా హీరోలంటే కేవ‌లం స్టోరీ విన‌డం...అందులో హీరో పాత్ర ఎలా ఉంటుంది? అన్నంత వ‌ర‌కే హీరో ప‌రిమిత‌మ‌య్యేవాడు. మిగ‌తా వ్య‌హారాల‌న్నింటిని ద‌ర్శ‌కుడు చూసుకునేవాడు.;

Update: 2025-04-28 02:30 GMT

ఒకప్పుడు సినిమా హీరోలంటే కేవ‌లం స్టోరీ విన‌డం...అందులో హీరో పాత్ర ఎలా ఉంటుంది? అన్నంత వ‌ర‌కే హీరో ప‌రిమిత‌మ‌య్యేవాడు. మిగ‌తా వ్య‌హారాల‌న్నింటిని ద‌ర్శ‌కుడు చూసుకునేవాడు. నిర్మాత ప‌ని నిర్మాత చేసేవాడు. సినిమా ప్రారంభోత్స‌వం రోజున హీరో క‌నిపిస్తారు. మ‌ళ్లీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైతే సెట్స్ కు వెళ్ల‌డం..సాయంత్ర‌మైతే? ఇంటికెళ్లిపోవ‌డం. షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత డబ్బింగ్ చెప్ప డం...రిలీజ్ కు వ‌స్తుందంటే? ప్రచార కార్య‌క్ర‌మాల్లో పాల్గోన‌డం వ‌ర‌కే ప‌రిమితం.

మ‌రి నేటి హీరోల ఇన్వాల్వ్ మెంట్ ఎలా ఉంటుంది? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. క‌ళ్ల ముందు ప్ర‌తీది క‌నిపిస్తుంది. ఓ ప్రాజెక్ట్ ఒప్పుకున్న త‌ర్వాత ఆ హీరో దానికోసం ఎన్ని గంట‌లు ప‌ని చేస్తున్నాడు? అవ‌స ర‌మైన శిక్ష‌ణ‌లు..ముందొస్తు ప్ర‌ణాళిక ఇలా ఎంతో గ్రౌండ్ వ‌ర్క్ చేస్తున్నారు. ఇదంతా సినిమా ప్రారంభానికి ముందే జ‌రుగుతుంది. లాంచింగ్ త‌ర్వాత మ‌ళ్లీ రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్ల‌డానికి కొంత స‌మ‌యం తీసుకుంటున్నారు.

ఈ స‌మయంలో క‌థ‌కు అవ‌స‌ర‌మైన వ‌ర్క్ షాపులు నిర్వ‌హిస్తున్నారు. హీరోలే నేరుగా లొకేష‌న్ల వేట‌లో పాల్గొంటున్నారు. సెట్స్ ఎలా వేసారని ద‌ర్శ‌కుడితో పాటు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. అవ‌స‌రం అనుకుంటే క్రియేటివ్ విభాగంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. ద‌ర్శ‌కుడు-హీరో మ‌ధ్య ఎంతో సున్నితంగా జ‌రుగుతోన్న ప్ర‌క్రియ‌. ఈ విష‌యంలో ఏ ఒక్క హీరో మిన‌హాయింపు కాదు. సీనియ‌ర్ హీరోల నుంచి ఆ త‌ర్వాత త‌రం హీరోల వ‌ర‌కూ అంతా సినిమా విష‌యంలో ఎంతో ఇన్వాల్వ్ అవుతున్నారు.

రిలీజ్ కోసం ఎంతో శ్ర‌మిస్తున్నారు. ద‌ర్శ‌కుడి ప్లానింగ్ ప్ర‌కారం ఎక్క‌డ ప్ర‌చారానికి హాజ‌రు కావాలంటే అక్క‌డ రెక్క‌లు క‌ట్టుకుని వాలిపోతున్నారు. ఎంతో బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎండ‌క‌న‌..వాన‌న‌క ఈ విష‌యంలో ఎంతో క‌మిట్ మెంట్ తో హీరోలు ప‌ని చేస్తున్నారు. ఈ విష‌యంలో భ‌విష్య‌త్ లో హీరోలు మ‌రింత ప‌రిణ‌తితో వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

Tags:    

Similar News