• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రష్మిక.. హిట్ వచ్చినా...

రష్మిక.. హిట్ వచ్చినా ట్రోల్స్ తప్పట్లేదు!

| ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ బాండిగ్ నేపథ్యంలో యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్ బీర్ తన నట విశ్వరూపం చూపించాడు.

By - Tupaki Desk
Update: 2023-12-06 02:45 GMT

రణ్ బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'యానిమల్' ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 1 విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని అందుకుంది. ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ బాండిగ్ నేపథ్యంలో యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్ బీర్ తన నట విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ అందరూ యానిమల్ ట్రాన్స్ లోనే ఉన్నారు.


రణ్ బీర్ తర్వాత విలన్ గా చేసిన బాబీ డియోల్ పాత్రకు భారీ రెస్పాన్స్ లభించింది. అలాగే చాలా రోజుల తర్వాత రష్మిక ఈ మూవీలో మంచి నటన కనబరిచింది. చాలా కాలంగా గ్లామర్ పాత్రలు చేస్తున్న రష్మికకి యానిమల్ లో యాక్టింగ్ కి స్కోప్ ఉన్న రోల్ దక్కడంతో తన పాత్రలో అదరగొట్టింది. కొన్ని కొన్ని సీన్స్ లో ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అయినా కూడా లాభం లేకుండా పోయింది.


రష్మిక కంటే సినిమాలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన కొందరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు. ఈ సినిమాలో రష్మిక తో పాటు తృప్తి దిమిరి ఓ కీ రోల్ ప్లే చేసింది. సినిమాలో తన బోల్డ్ నెస్ తో యూత్ ని ఎంతగానో అట్రాక్ట్ చేసింది. దీంతో సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ అంతా సోషల్ మీడియాలో ఈ అమ్మడి గురించి సర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఈమె తర్వాత విలన్ బాబీ డియల్ ముగ్గురు భార్యలుగా నటించిన వాళ్లు కూడా తమ స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్నారు.

ముఖ్యంగా బాబీ డియోల్ మూడో భార్య స్క్రీన్ పై ఎంతో అందంగా కనిపించడం, ఆమెతో బాబి డియోల్ సీన్స్ కి థియేటర్స్ లో భారీ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు తప్పితే రష్మికను ప్రత్యేకంగా మెచ్చుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ సినిమాతో రష్మిక కు హిట్ వచ్చినా కూడా ఆమె లిప్ లాక్ సీన్స్, బోల్డ్ సీన్స్ లో నటించడంతో ట్రోల్స్ తప్పడం లేదు.

దానికి తోడు రష్మిక కంటే సినిమాలో నటించిన మిగతా వాళ్ళే ఎక్కువగా వైరల్ అవుతున్నారు. బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకి మరో ఆఫర్ తో అయినా ఇలాంటి గాసిప్స్, ట్రోల్స్ ఆగుతాయేమో చూడాలి. కాగా యానిమల్ మూవీకి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.336 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ మూవీతో రణబీర్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. హిందీలోనే కాకుండా తెలుగులోనే ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.

https://t.co/4mDErVrlMD

— R R (@RacchaRidhvik) December 4, 2023
Tags:    
  • Animal 
  • Ranbirkapoor 
  • Rashmikamandanna 
  • Sandeepreddyvanga 
  • Triptidimiri 
  • Bobbydeol 

Similar News

అందాల ఆమ‌ని స్టార్ హీరోల‌కు దూరంగా!

2026-11-11 22:30 GMT

డేట్ నైట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన కియారా-సిద్ధార్థ్!

2026-11-11 19:30 GMT

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS