డైరెక్టర్ పై నటి సీరియస్..సారీ చెప్పిన నిర్మాత!
కొంతమంది డైరెక్టర్లు ఆన్ సెట్స్ లో చాలా సీరియస్ గా ఉంటారు. చెప్పింది చెప్పినట్లు చేయకపోతే? ఇష్టానుసారం తిడతారు.;
కొంతమంది డైరెక్టర్లు ఆన్ సెట్స్ లో చాలా సీరియస్ గా ఉంటారు. చెప్పింది చెప్పినట్లు చేయకపోతే? ఇష్టానుసారం తిడతారు. మరికొంత మందైతే కొడతారు కూడా. సీన్ పర్పెక్షన్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కారు. అవసరమైతే ఒక సీన్ ని రెండు..మూడు రోజులు కూడా చేస్తారు. అంత డెడకేషన్ గా పని చేస్తా రు. ఈ ప్రోసస్ లో మాట తూలడం లాంటివి జరుగుతుంటాయి. ముఖ్యంగా కొత్తగా వచ్చే నటీనటులు విషయంలో కాస్త కఠినంగా ఉంటారు.
అలాగని సీనియర్ నటీమణులు మినహాయింపు కాదు. అప్పుడప్పుడు దండన వాళ్లకు కూడా తప్పదు. అయితే తిట్టడం అన్నది హద్దు మిరితే తిరుగు బాటు అనేది ఎలా ఉంటుందో చూపించింది బాలీవుడ్ నటి ఈషా గుప్తా. సాజిద్ ఖాన్ డైరెక్ట్ చేసిన `హమ్ షకీల్`` సినిమాలో ఈషా గుప్తా నటించింది. ఆ సినిమా కోసం తానెంతో కష్టపడ్డానని...ఎంతో శ్రమించి ప్రమోషన్ కూడా పూర్తి చేసినా ఏ మాత్రం విలువ మర్యాద లేకుండా సాజిద్ తిట్టేవాడట.
నొటికొచ్చిన మాటలు మాట్లాడి మనసు చంపేలా చేసేసాడు అంది. దీంతో సహనం నశించిన ఈషా గుప్తా ఓ రోజు డైరెక్టర్ ఇంటికి నేరుగా కారేసుకుని వెళ్లిందట తన కోపాన్ని దించేసుకోవడం కోసం. సరిగ్గా అదే సమయంలో నిర్మాత జాకీ భగ్నాని బయట ఉన్నాడట. ఆమెలో ఆవేషం చూసి గొడవ ఎందుకని ఆ సినిమాకి తానే నిర్మాత కావడంతో క్షమాపణ కోరాడట. దీంతో ఈషా గుప్తా శాంతించి అక్కడ నుంచి తిరిగి కారేసుకుని ఇంటికి వచ్చేసిందట.
ఆ సమయంలో ఆ సినిమా ఛాన్స్ వదులుకోవడానికి కూడా సిద్దపడే ఇంటికి వెళ్లినట్లు తెలిపింది. హీరోయి న్-డైరెక్టర్ మధ్య అప్పుడప్పుడు ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. కొందరు సహనంగా మెలిగి కొనసాగుతారు. మరికొంత మంది ఈషా గుప్తాలో తిరుగు బావుటా ఎగరేసి అవకాశం వదులుకుంటారు.