తీరని లోటు ఎప్పటికీ అలాగే ఉంటుంది!

తాజాగా ఈషా డియోల్ తన జీవిత ప్రయాణం, అనుభవాలు , వ్యక్తిగత నష్టాల గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్న కొన్ని ఆలోచనలు అభిమానుల హృదయాలను కదిలిస్తున్నాయి.

Update: 2026-06-08 06:45 GMT

సెలబ్రిటీల జీవితాలు బ‌య‌ట ప్రపంచానికి ఎంతో అందంగా.. వైభవంగా క‌నిపించినా? వారి అంతరంగంలో కూడా సామాన్యుల లాగే ఎన్నో సున్నితమైన భావోద్వేగాలు, మానసిక సంఘర్షణలు దాగి ఉంటాయి. తాజాగా ఈషా డియోల్ తన జీవిత ప్రయాణం, అనుభవాలు , వ్యక్తిగత నష్టాల గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్న కొన్ని ఆలోచనలు అభిమానుల హృదయాలను కదిలిస్తున్నాయి. ` అత్యంత ఆప్తులైన వారిని కోల్పోవడం లేదా జీవితంలో జరిగే కొన్ని చేదు పరిణామాలు సృష్టించే లోటు ఎప్పటికీ మనల్ని వదిలిపెట్టి వెళ్లదు. సమయం గడిచే కొద్దీ ఆ బాధ తగ్గిపోతుందని చాలా మంది అంటుంటారు.

కానీ అది నిజం కాదు. ఆ లోటుతో, ఆ బాధతోనే జీవించడం అలవాటు చేసుకుంటాము. ఆ బరువును మోస్తూనే ముందుకు సాగడం నేర్చుకుంటామన్నారు. ఈషా డియోల్ కొంతకాలంగా వ్యక్తిగత జీవితంలో పలు మార్పులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తన వైవాహిక బంధానికి ముగింపు పలకడం వంటి పరిణామాలు ఆమెను మానసికంగా ఎంతో ప్రభావితం చేశాయి. అయినా ఒక తల్లిగా తన ఇద్దరు కుమార్తెల బాధ్యతలను చూసుకుంటూ మరోవైపు కెరీర్‌పై దృష్టి పెట్టి ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. కష్ట సమయాల్లో గుండె నిబ్బరాన్ని కోల్పోకుండా ఉండటమే జీవితం మనకు నేర్పే గొప్ప పాఠమన్నారు.

ఈ ప్రయాణంలో తన కుటుంబం, ముఖ్యంగా తల్లి హేమమాలిని అందించిన మద్దతు ఎనలేనిదని ఈషా పలు గుర్తు చేసుకున్నారు. ఒక మహిళగా సమాజంలో నిలబడటానికి.. ఎలాంటి ఒడిదొడుకులనైనా తట్టుకుని నిలబడటానికి త‌న తల్లి జీవితమే తనకు అతిపెద్ద స్ఫూర్తి అని చెప్పారు. జీవితంలో ఒంటరితనం .. బాధ ఎదురైనప్పుడు కుంగిపోకుండా మనల్ని మనం మరింత బలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలన్నారు. అలాగే సినిమా రంగంలో తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి కూడా ఈషా ఆశాభావాన్ని వ్య‌క్తం చేసారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటిగా తనకు సంతృప్తినిచ్చే విలక్షణమైన వెబ్ సిరీస్‌లు, డిజిటల్ కంటెంట్‌లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవం ఒక నటిగా తన నటనను మరింత పరిణతి చెందేలా చేస్తుందని భావోద్వేగాలను స్క్రీన్‌పై పండించడానికి తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. జీవితంలో నష్టాలను, బాధలను అనుభవిస్తున్న ఎంతో మందికి ఈషా వ్యాఖ్యలు ఊరటను ఇస్తాయి. బాధను దాచుకోవడం కంటే దానిని అంగీకరిస్తూ ఆ జ్ఞాపకాలతోనే కొత్త జీవితాన్ని నిర్మించుకోవడం ముఖ్యం అనే సందేశం ఇచ్చారు.

Tags:    

Similar News