ప్ర‌పంచంలోనే నంబ‌ర్ వ‌న్ పాపుల‌ర్ హీరో

బ్రిటీష్ గాయకుడు - గేయ రచయిత ఎడ్ షీరాన్ ఒక భార‌తీయ క‌థానాయ‌కుడిని ఆకాశానికెత్తేశాడు.;

Update: 2025-06-20 18:30 GMT

బ్రిటీష్ గాయకుడు - గేయ రచయిత ఎడ్ షీరాన్ ఒక భార‌తీయ క‌థానాయ‌కుడిని ఆకాశానికెత్తేశాడు. అత‌డు మ‌రెవ‌రో కాదు- కింగ్ ఖాన్ షారూఖ్‌. ఖాన్ ప్ర‌పంచంలోనే ఒక‌టో లేదా రెండో అత్యంత‌ ప్ర‌సిద్ధ వ్య‌క్తి! అంటూ ఎడ్ షీరాన్ కొనియాడాడు. అంతేకాదు షీర‌న్ ఇప్పుడు షారుఖ్ ఖాన్ చిత్రం కోసం హిందీ ట్రాక్‌ను రికార్డ్ చేసినట్లు ధృవీకరించారు. తాజా సింగిల్ `సఫైర్` చిత్రీకరణ సమయంలో షేర్ చేసిన తెరవెనుక వీడియోలో ఖాన్ సినిమాకి షీరాన్ పాడార‌నే విషయం వెల్లడైంది.

ప్ర‌స్తుతానికి ఖాన్ సినిమాకి కింగ్ అనే టైటిల్ ప్ర‌చారంలో ఉంది. దీనికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుండి చాలా విష‌యాలు రహస్యంగానే ఉన్నాయి కానీ షీరాన్ వ్యాఖ్యలను బ‌ట్టి అత‌డి బాలీవుడ్ ఎంట్రీ కింగ్ తో సాధ్య‌మ‌వుతోంద‌ని ఊహిస్తున్నారు. ఎడ్ షీరాన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో తెరవెనుక వీడియోను పోస్ట్ చేయ‌డంతో ఈ ఊహాగానాలు మ‌రింత ఊపందుకున్నాయి. నిజానికి షీర‌న్ ఓ పంజాబీ పాట‌ను చేస్తున్నార‌ని ప్ర‌చారం సాగింది. కానీ.. ఎడ్ షీరాన్ స్వయంగా గందరగోళాన్ని తొలగించాడు. ఈ పాట షారుఖ్ ఖాన్ చేస్తున్న బాలీవుడ్ సినిమా కోసం. ఇది అరిజిత్ తో కలిసి సఫైర్ కి పంజాబీ వెర్షన్. నేను ఈ సమయంలో అన్ని భాషలలో ప‌ని చేస్తున్నాను! అని ఆయన రాశారు. దీంతో కింగ్ ఖాన్ సినిమా కోసం షీర‌న్ పాడుతున్నార‌ని క్లారిటీ వ‌చ్చింది. స‌ఫైర్ గీతంలో షారూఖ్, అరిజీత్ కూడా ఉన్నారు.

ఎడ్ షీరన్ భారతదేశానికి మొదటిసారి పరిచయం కావడం లేదు. భారతదేశంలో తన ఇటీవలి పర్యటన సందర్భంగా, షీరన్ భారతీయ సంగీతాన్ని తాను ఎంతగా ఆస్వాధిస్తున్నాడో ప్రస్తావించాడు. భవిష్యత్తులో భారతీయ సినిమాలకు ప‌ని చేసే అవ‌కాశం ఉంద‌ని హింట్ ఇచ్చాడు. కింగ్ సినిమాకి షీర‌న్ పాడుతున్న పాట‌ను క్రాస్ ఓవ‌ర్ ప్ర‌మోష‌న్స్ కోసం ఉప‌యోగిస్తారా? లేదా మూవీలో ఏదైనా ట్రాక్ లాగా ఉప‌యోగ‌ప‌డుతుందా? అన్న‌ది తేలాల్సి ఉంది.

Tags:    

Similar News