• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చెప్పినట్టుగా ఈగల్.. సోలో...

చెప్పినట్టుగా ఈగల్.. సోలో డేట్ కావాలంటున్న నిర్మాత!

| మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఈగల్ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సింది.

By - Tupaki Desk
Update: 2024-01-19 07:56 GMT

మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఈగల్ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సింది. జనవరి 13వ తేదీన ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్సయ్యే చాన్స్ లేదు అని కూడా అప్డేట్స్ ఇచ్చారు. అయితే అదే సమయంలో సంక్రాంతికి మరో నాలుగు సినిమాలు పోటీగా నిలిచిన విషయం తెలిసిందే. పోటీ తీవ్రత ఎంత ఉన్నా కూడా ఈగల్ సినిమా యూనిట్ మాత్రం అసలు తప్పుకునేది లేదు అని చెబుతూ వచ్చింది.


అయితే ఈ క్రమంలో ఎవరో ఒకరు తప్పుకుంటే గాని సంక్రాంతి బిజినెస్ సాఫీగా సాగదు అని తెలుగు చిత్ర నిర్మాతలు మండలి ఆలోచించింది. ఈ క్రమంలో అందరితోనూ మీటింగ్ కూడా జరిపారు. అయితే ఎవరు తప్పుకోకపోవడంతో ఈగల్ సినిమా ఒక్కటే వెనుకడుగు వేయాల్సి వచ్చింది. అయితే ముందుగా సంక్రాంతి నుంచి ఎవరైతే తప్పుకుంటారో వారికి తప్పకుండా మరొక సోలో రిలీజ్ డేట్ ఇస్తాము అని ఎలాంటి క్లాష్ లేకుండా థియేటర్స్ ఉంటాయి అని ఫిలిం ఛాంబర్ సభ్యులు భరోసా ఇచ్చారు.

నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా చర్చల తర్వాత అందుకు ఒప్పుకుంది. ఇక ఫిబ్రవరి 9వ తేదీ బెస్ట్ అని కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు అదే డేట్ కు మరో మూడు సినిమాలు పోటీగా ఉండబోతున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన టిల్లు స్క్వేర్ అదే డేట్కు రాబోతుండగా రజినీకాంత్ లాల్ సలామ్ కూడా తెలుగులో అదే రోజు రానుంది.

రీసెంట్గా ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేసిన ఆ ఊరు పేరు భైరవకోన కూడా అదే డేట్ ను టార్గెట్ చేసింది. ప్రెస్ మీట్ లో కూడా హీరో సందీప్ కిషన్ మేము ఎట్టి పరిస్థితుల్లోనూ డేట్ మార్చుకునే అవకాశం లేదు అని కూడా ధీమాగా చెప్పాడు. ఇక ఈ విషయంపై మళ్ళీ స్పందించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు లేఖ రాశారు.

సంక్రాంతి నుంచి తప్పుకున్న సినిమాకు సోలో రిలీజ్ డేట్ ఇస్తాము అని మాట ఇచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం కొన్ని సినిమాలు అదే డేట్కు వస్తున్నాయి. ఈ విషయంపై తెలుగు ఫిల్మ్ చాంబర్ సభ్యులు చర్చించి తమకు సోలో డేట్ ఇవ్వాల్సిందే అని ఆ లేఖలో వివరణ ఇచ్చారు. మరి ఈ విషయంపై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి చిత్ర నిర్మాతల మండలి ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.

Tags:    
  • Eagle 
  • Raviteja 
  • Peoplemediafactory 
  • Letter 
  • Filmchambar 
  • Tgviswaprasad 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS