ప్రశాంత్ వర్మ అడ్వాన్స్ రూమర్స్‌పై డీవీవీ క్లారిటీ
'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు.;
'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. ఆయన తన తదుపరి ప్రాజెక్టుల కోసం పలువురు అగ్ర నిర్మాతల నుంచి భారీ మొత్తంలో అడ్వాన్సులు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో, పలు వెబ్ పోర్టల్స్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ గాసిప్స్‌లో చాలా మంది పెద్ద నిర్మాతల పేర్లు వినిపించాయి.
ఈ ప్రచారంలో 'RRR' లాంటి గ్లోబల్ హిట్‌ను అందించిన ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య పేరు కూడా బలంగా వినిపించింది. ప్రశాంత్ వర్మకు అడ్వాన్స్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్ల లిస్ట్‌లో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ రూమర్స్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు దారితీయడంతో, డీవీవీ సంస్థ ఈ విషయంపై డైరెక్ట్ గా స్పందించాల్సి వచ్చింది.
ఈ ఊహాగానాలకు, తప్పుడు ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టే ఉద్దేశంతో, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. నిర్మాత డీవీవీ దానయ్య పేరుతో విడుదలైన ఈ స్టేట్‌మెంట్, ఈ వార్తలను తీవ్రంగా ఖండించింది. ప్రశాంత్ వర్మ అడ్వాన్స్ తీసుకున్నారన్న దాంట్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.
ఆ ప్రకటనలో, "డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ డీవీవీ దానయ్య నుండి అడ్వాన్స్ తీసుకున్నారంటూ ఇటీవలి కాలంలో వస్తున్న ఊహాగానాలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవి" అని గట్టిగా పేర్కొన్నారు. దీంతో ఈ ప్రచారానికి ఒక స్పష్టమైన ముగింపు పలికినట్లయింది. ఈ విషయాన్ని మరింత వివరంగా తెలియజేస్తూ, "డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు, అగ్రిమెంట్ జరగలేదు" అని ఆ నోట్‌లో కుండబద్దలు కొట్టారు.
చివరగా, మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు మరియు సోషల్ మీడియా పేజీలు.. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసే ముందు, వాస్తవాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ అధికారిక క్లారిటీతో, ప్రశాంత్ వర్మ అడ్వాన్స్ వివాదంలో డీవీవీ దానయ్య పేరుకు సంబంధించి వస్తున్న రూమర్స్‌కు పూర్తిగా చెక్ పడింది. మరి ప్రశాంత్ వర్మ వైపు నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి.