ద‌స‌రాకి వాళ్లు రెడీ అవుతున్నారా?

కొన్ని నెలలు అగితే మంచి సీజ‌న్ దొరుకుతుంద‌ని ద‌స‌రా కోసం వెయిట్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది.;

Update: 2025-05-07 06:25 GMT

ద‌స‌రా సీజ‌న్ అంటే స్టార్ హీరోల సినిమాలు స‌హ‌జం. ఇప్పటికే న‌ట‌సింహ బాల‌కృష్ణ‌- మెగాస్టార్ చిరంజీవి ద‌సరా బ‌రిలో ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. బాల‌య్య 'అఖండ 2 శివ‌తాండవం'తో విధ్వంసం సృష్టించ‌డానికి రెడీ అవుతున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో ఆ సీజీన్ మిస్ కాకూడ‌ద‌ని స్ట్రాంగ్ గా ఫిక్సై ప‌ని చేస్తుంది టీమ్. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో చిరు 'విశ్వంభ‌ర' కూడా అదే సీజ‌న్ ఎన్ క్యాష్ చేసుకోవాల‌ని చూస్తుంది. ఎలాగూ ఆల‌స్య‌మైంది.

కొన్ని నెలలు అగితే మంచి సీజ‌న్ దొరుకుతుంద‌ని ద‌స‌రా కోసం వెయిట్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. వీళ్లిద్ద‌రితో పాటు తాజాగా మ‌రో ముగ్గురు స్టార్ హీరోలు కూడా పోటీగా బ‌రిలోకి దిగ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా మారుతి ద‌ర్శ‌త‌క‌త్వంలో `రాజాసాబ్` షూటింగ్ న‌త్త‌న‌డ‌క‌న సాగు తున్న సంగ‌తి తెలిసిందే. చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌కు చేరుక‌న్న నేప‌థ్యంలో ద‌స‌రా వ‌ర‌కూ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసి రిలీజ్ చేస్తే బాగుంటుంద‌నే ఆలోచ‌న‌లో ఉన్నారుట యూవీ నిర్మాత‌లు.

అలాగే కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ న‌టిస్తోన్న `ఇడ్లీ క‌డై` ఇప్ప‌టికే రిలీజ్ అవ్వాలి. కానీ అనివార్య కార‌ణాల‌తో వాయిదా ప‌డ‌టంతో ధ‌నుష్ కూడా ద‌స‌రా అయితే బాగుంటుంద‌ని టీంతో డిస్క‌ష‌న్స్ చేస్తున్నాడుట‌. అక్టోబ‌ర్ 1న రిలీజ్ చేస్తే బాగుంటుంద‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలిసింది. అలాగే క‌న్న‌డ స్టార్ రిష‌బ్ శెట్టి స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో `కాంతార చాప్ట‌ర్ 1` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రాన్ని కూడా ద‌సరాకే రిలీజ్ చేయాల‌ని ఫిక్స్ అయ్యారట‌. గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని అక్టోబ‌ర్ 2న రిలీజ్ చేయాల‌ని ఆ తేదీని ప‌రిశీలిస్తున్నారుట‌. బాల‌య్య సినిమా తొలుత సెప్టెంబ‌ర్ అను కున్నారు. కానీ ద‌స‌రా ముందు పెట్టుకుని సెప్టెంబ‌ర్ ఎందుక‌ని పున ప‌రిశీలించి ద‌స‌రాకి ఫిక్సైన‌ట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News