ఈ దసర బరిలో ఎన్ని సినిమాలున్నాయి...

ఇక అన్ని పండగల మాదిరిగానే ఇప్పుడు దసర కి సైతం కొన్ని సినిమాలు సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి.

Update: 2026-10-04 08:10 GMT

పండగ వచ్చిందంటే చాలు సినిమా ఇండస్ట్రీలో సినిమాల పండుగ మొదలవుతుంది. చాలామంది స్టార్ హీరోలు నిర్మాతలు పండగ సీజన్ ను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కారణం ఏంటంటే పండగ వచ్చిందంటే ఎక్కడెక్కడో ఉన్న జనాలు అందరూ వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఒక దగ్గర కలుస్తారు. కాబట్టి అందరు కలిసి సరదాగా సినిమాకి వెళ్దాం అని డిసైడ్ అయి మూవీ చూడ్డానికి వెళ్తుంటారు. ఈ క్రమంలోనే సినిమాలకు ప్రేక్షకుల్లో ఆదరణ ఎక్కువగా ఉంటుంది. పండగ సీజన్ వచ్చిందంటే చాలు ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమాలను చూసి ఎంజాయ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్లను దృష్టిలో పెట్టుకొని పండగ సీజన్లో సినిమాని దింపితే ఆ మూవీస్ కి భారీ కలెక్షన్స్ వస్తాయి. ఇక అన్ని పండగల మాదిరిగానే ఇప్పుడు దసర కి సైతం కొన్ని సినిమాలు సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. ఆ సినిమాలేంటి ఒక్కో మూవీ మీద ఎలాంటి బజ్ ఉందనేది ఒకసారి మనం తెలుసుకుందాం...

ఆదర్శ కుటుంబం

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమా అక్టోబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకి సక్సెస్ ఫుల్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా దసర పండుగ విన్నర్ గా నిలిచే అవకాశం కూడా ఉంది... వెంకటేష్ సినిమా అంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడి మరీ చూస్తుంటారు. అందువల్లే ఈ మూవీని పండగ సీజన్ లో రంగంలోకి దింపుతున్నారు...

హనుమాన్ అంశ్

చిన్న బడ్జెట్ తో తెరకెక్కి నార్త్ లో పెను సంచలనాన్ని క్రియేట్ చేసినా హనుమాన్ అంశ్ మూవీ అక్కడ వందల కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. అందుకే ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడానికి గత కొన్ని రోజులుగా సన్నాహాలు చేస్తున్నారు. ఎట్టకేలకు అక్టోబర్ 9వ తేదీన ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా అనేది చూడాలి... డిఫరెంట్ సబ్జెక్ట్ లను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు మరి దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది తెలియాల్సి ఉంది...ఈ మూవీని తెలుగు లో డబ్ చేస్తే చూడటానికి ఇప్పటికే ఒక వర్గం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...

కామ్రేడ్ కళ్యాణ్

శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కుతున్న 'కామ్రేడ్ కళ్యాణ్' సినిమా నక్సలైట్ల స్టోరీ ని బేస్ చేసుకొని తెరకెక్కుతున్నప్పటికి అందులో కామెడీని సైతం మిళిత చేసి ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కోన వెంకట్ అండర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్టోబర్ 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆదర్శ కుటుంబం సినిమాతో పోటీ పడుతున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే దసరా పండక్కి ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే...

జైలర్ 2

రజనీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జైలర్ 2' సినిమా ప్రేక్షకులందరికి ఒక కొత్త అనుభూతిని ఇస్తుందంటూ మేకర్స్ చెబుతున్నారు. జైలర్ మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ అవ్వడంతో రెండో పార్ట్ మీద ప్రేక్షకులకు విశేషమైన అంచనాలైతే పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాను తెరకెక్కించి ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకోవాలని దర్శకుడు ప్రణాళికలు రూపొందించాడు. ఇక ఈ మూవీని అక్టోబర్ 15 న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. మేకర్స్ అనుకున్నట్టుగానే ఈ సినిమా ఈ దసర విన్నర్ గా నిలుస్తుందా? ఈ మూవీ తో పాటు రిలీజ్ అయ్యే అన్ని సినిమాలకు పోటీని ఇస్తూ పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయగలదా లేదా అనేది చూడాలి...

రణబాలి

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రణబాలి' సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. స్వాతంత్య్రోద్యమం లో జరిగిన కొన్ని సంఘటనలను తీసుకుని దానికి ఫిక్షన్ స్టోరీ ని జోడించి ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీ ఇప్పటి వరకు ఎప్పుడూ ఏ సినిమాలో చూపించనటువంటి కొత్త స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. ఈ మూవీ అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది... ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి బజ్ ఉంది. కాబట్టి ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ ను వసూలు చేసే అవకాశమైతే ఉంది. ఈసారి దసర విన్నర్ గా ఈ మూవీ నిలుస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది...

గరివిడి లక్ష్మీ

ఆనందిని మెయిన్ లీడ్ లో చేస్తున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు నిర్మస్తున్నారు. ఈ సినిమాతో వాళ్ళకి ఒక మంచి సక్సెస్ వస్తుందని భావిస్తున్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే సంక్రాంతి కి 'రాజసాబ్' మూవీ తో వచ్చిన వీళ్ళు అనుకున్న సక్సెస్ ను సాధించలేకపోయారు. మరి ఈ చిన్న సినిమా తో పెద్ద మ్యాజిక్ చేసి దసర విన్నర్ గా నిలవాలని చూస్తున్నారు...ఈ మూవీ అక్టోబర్ 17 వ తేదీన రిలీజ్ అవుతుంది.

Tags:    

Similar News