దురంధ‌ర్ ఆ జాబితాలో టాప్ లో నిలుస్తుందా?

ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా న‌టించిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ దురంధ‌ర్, వారం రోజుల త‌ర్వాత కూడా అన్ని ఏరియాల్లో బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్ల‌ను అందుకుంటుంది.;

Update: 2025-12-13 07:12 GMT

ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా న‌టించిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ దురంధ‌ర్, వారం రోజుల త‌ర్వాత కూడా అన్ని ఏరియాల్లో బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్ల‌ను అందుకుంటుంది. డిసెంబ‌ర్ 5న రిలీజైన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తో పాటూ ఫ‌స్ట్ వీకెండ్ కూడా భారీ వ‌సూళ్లను సాధించింది. మంచి మౌత్ టాక్ ను తెచ్చుకున్న దురంధ‌ర్ ఇప్పుడు సెకండ్ వీకెండ్ పై ఫోక‌స్ చేసింది.

మంచి క‌లెక్ష‌న్ల‌తో దూసుకెళ్తున్న దురంధ‌ర్

ఎలాంటి అంచ‌నాల్లేకుండా వ‌చ్చిన దురంధ‌ర్ ఇప్ప‌టికే ఇండియాలో రూ. 240 కోట్లు సాధించ‌గా, సినిమాలోని దేశ‌భ‌క్తి అంశాల వ‌ల్ల ఈ సినిమా ఆడియ‌న్స్ లోకి రీచ్ అయి వీకెండ్స్ లో మంచి బుకింగ్స్ ను న‌మోదు చేసుకుంటుంది. ట్రేడ్ వ‌ర్గాల ప్ర‌కారం, దురంధ‌ర్ సినిమా మొద‌టి వీకెండ్ లాగానే రెండో వీకెండ్ లో కూడా మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టే అవ‌కాశ‌ముంద‌ని చెప్తున్నారు.

ఎ స‌ర్టిఫికెట్‌తోనే భారీ స‌క్సెస్

అదే నిజ‌మైతే దురంధ‌ర్ ఈజీగా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కమైన రూ.500 కోట్ల క్ల‌బ్ లో చేర‌డం ఖాయం. సెన్సార్ బోర్డ్ నుంచి ఎ స‌ర్టిఫికెట్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ, గ‌ల్ఫ్ దేశాల్లో ఈ సినిమా బ్యాన్ అయిన‌ప్ప‌టికీ దురంధ‌ర్ ఇంత పెద్ద హిట్ అవ‌డం నిజంగా విశేష‌మ‌నే చెప్పాలి. సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్‌ఫుల్ గా ర‌న్ అవుతుంది కాబ‌ట్టి అప్పుడే ఫైన‌ల్ క‌లెక్ష‌న్ల‌ను అంచ‌నా వేయ‌డం క‌ష్ట‌మే.

కానీ దురంధ‌ర్ బాక్సాఫీస్ ఊపు చూస్తుంటే మాత్రం ఈ ఇయ‌ర్ లో భారీ క‌లెక్ష‌న్లు సాధించిన సినిమాగా నిలిచే అవ‌కాశాలు కూడా పుష్క‌లంగానే క‌నిపిస్తున్నాయి. అదే నిజ‌మైతే ఈ ఇయ‌ర్ బాలీవుడ్ నుంచి వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్లు ఛావా, సైయారా క‌లెక్ష‌న్ల‌ను కూడా ఈ సినిమా అధిగ‌మించాలి. దానికి తోడు ఈ వారం దురంధ‌ర్ కు పెద్ద‌గా పోటీ లేక‌పోవ‌డంతో క‌లెక్ష‌న్లు మెరుగ‌య్యే ఛాన్సుంది. నెక్ట్స్ వీక్ జేమ్స్ కామెరూన్ అవ‌తార్, ఆ త‌ర్వాత కార్తీక్ ఆర్య‌న్ మూవీ రానుండ‌టంతో అప్పుడు దురంధ‌ర్ కు కొంచెం స్క్రీన్లు త‌గ్గే అవ‌కాశాలున్నాయి. మ‌రి రాబోయే రోజుల్లో దురంధ‌ర్ ఏ స్థాయికి చేరుకుంటుందో చూడాలి. కాగా ఈ సినిమాకు పార్ట్ 2 ఉంటుంద‌ని ఇప్ప‌టికే మేక‌ర్స్ క్లారిటీ ఇవ్వ‌గా దురంధ‌ర్ పార్ట్2 వ‌చ్చే ఏడాది మార్చి లో రిలీజ్ కానుంద‌న్న సంగ‌తిత తెలిసిందే.

దురంధ‌ర్ ను మెచ్చుకుంటూ హృతిక్ ట్వీట్

ఇదిలా ఉంటే ఈ సినిమాపై బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ చేసిన కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశ‌మైన సంగ‌తి తెలిసిందే. దురంధ‌ర్ సినిమా చూసి ఎన్నో విష‌యాల‌ను నేర్చుకున్నాన‌ని, కానీ ఈ సినిమాలో చూపించిన రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను మాత్రం తాను ఒప్పుకోన‌ని చెప్తూ ఓ పోస్ట్ చేశారు. ఇది వివాదాస్ప‌దమ‌వ‌డంతో మ‌రో పోస్ట్ చేస్తూ ఈ సినిమాను డైరెక్ట‌ర్ ఆదిత్య‌ధ‌ర్ చాలా బాగా తెర‌కెక్కించార‌ని, సినిమా త‌న హృద‌యానికి హ‌త్తుకుంద‌ని చెప్ప‌గా, దానికి డైరెక్ట‌ర్ రిప్లై ఇస్తూ ఈ సినిమాపై మీరు చూపించిన అభిమానానికి కృత‌జ్ఞ‌త‌లు, ఈ సినిమాకు పార్ట్2 వ‌స్తుంద‌ని, అప్పుడు అంద‌రి సూచ‌న‌ల‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తామ‌ని చెప్పారు.

Tags:    

Similar News