మా దగ్గర అలా కాదు.. తెలుగు ఆడియెన్స్‌పై దుల్కర్ కామెంట్స్
దుల్కర్ సల్మాన్.. ఈ పేరుకు పాన్ ఇండియా స్థాయిలో పెద్ద ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా 'మహానటి', 'సీతారామం' లాంటి క్లాసిక్స్ తర్వాత తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఏర్పడింది.;
దుల్కర్ సల్మాన్.. ఈ పేరుకు పాన్ ఇండియా స్థాయిలో పెద్ద ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా 'మహానటి', 'సీతారామం' లాంటి క్లాసిక్స్ తర్వాత తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. ప్రస్తుతం రానా దగ్గుబాటితో కలిసి తన కొత్త సినిమా 'కాంత' ప్రమోషన్లలో బిజీగా ఉన్న దుల్కర్, ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకుల గురించి కొన్ని ఆసక్తికరమైన, లోతైన కామెంట్స్ చేశాడు.
మలయాళం, తమిళ్, హిందీ, తెలుగు.. ఇలా పలు భాషల్లో పనిచేసిన అనుభవంతో, ఒక్కో ఇండస్ట్రీ ఆడియెన్స్ ప్రవర్తించే తీరుపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని దుల్కర్ అన్నాడు. ముఖ్యంగా, ఒక నటుడు కొంత గ్యాప్ తీసుకున్నప్పుడు ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారు అనే విషయంలో ఆయన ఒక పెద్ద విషయాన్ని బయటపెట్టాడు. తన సొంత ఇండస్ట్రీతో పోలుస్తూ తెలుగు ఆడియెన్స్ గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అసలు విషయం ఏమిటంటే, దుల్కర్ తన సొంత పరిశ్రమ అయిన మలయాళం గురించి మాట్లాడుతూ, "మా దగ్గర ఒక హీరో రెండు, మూడేళ్లు సినిమాలు చేయకపోతే ప్రేక్షకులు దాదాపు వాళ్లను మర్చిపోతారు. అక్కడ పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది" అని అన్నారు. "తెలుగులో మాత్రం పరిస్థితి పూర్తిగా వేరు. ఇక్కడి ప్రేక్షకులు చాలా స్పెషల్" అంటూ దుల్కర్ తెలుగు ఫ్యాన్స్‌పై ప్రశంసలు కురిపించాడు.
ఇక్కడ ఒక హీరో కొంతకాలం కనిపించకపోతే, 'ఎక్కడున్నావ్? ఎందుకు సినిమాలు చేయట్లేదు?' అని ప్రేమతో నిలదీస్తారు. రానా విషయంలోనే నేను ఇది గమనించాను. తమ హీరోలను మిస్ అవుతారు, వాళ్లు మళ్లీ వచ్చి సక్సెస్ అవ్వాలని, కొత్త విషయాలు ట్రై చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు.. అని దుల్కర్ చెప్పాడు.
నిజానికి, 'ఓకే బంగారం' సినిమా ఆఫర్ వచ్చినప్పుడు, తనకు తెలుగు రాదని, సినిమాను పాడుచేస్తానేమోనని భయపడి వద్దని చెప్పినట్లు దుల్కర్ గుర్తుచేసుకున్నాడు. అలాంటిది, ఈ రోజు తెలుగు ప్రేక్షకులు తనను ఇంతలా ఓన్ చేసుకోవడం ఒక బ్లెస్సింగ్ అని ఆయన ఫీల్ అవుతున్నాడు. 'కాంత' లాంటి ఒక కొత్త తరహా సినిమా చేయడానికి కూడా ఈ ప్రేక్షకులు ఇచ్చే ధైర్యమే కారణం కావచ్చు. ఏదేమైనా, ఒక స్టార్ హీరో, అందులోనూ మరో ఇండస్ట్రీకి చెందిన నటుడు, తన సొంత ప్రేక్షకులతో పోల్చి మరీ తెలుగు ఆడియెన్స్ గొప్పతనం గురించి ఇంత ఓపెన్‌గా మాట్లాడటం చాలా అరుదు. ఇక కాంత సినిమాతో దుల్కర్ ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి.