నిర్మాతగా మరో మెట్టు ఎక్కేసిన హీరో..!
అలా హీరోగానే కాదు ప్రొడ్యూసర్ గా కూడా దుల్కర్ తన సత్తా చాటుతున్నాడు. దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ గా తన ప్రొడక్షన్ లో లోక సినిమా ప్రొడ్యూస్ చేశాడు.;
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అతను మలయాళంలో చేస్తున్న సినిమాలు పెద్దగా సౌండ్ చేయట్లేదు కానీ తెలుగులో దుల్కర్ చేస్తున్న సినిమాలు మాత్రం మంచి ఫలితాన్ని అందుకుంటున్నాయి. దాని వల్ల దుల్కర్ రేంజ్ రోజు రోజుకి పెరుగుతుంది. తన కథల జడ్జిమెంట్ తో సర్ ప్రైజ్ చేస్తున్నాడు దుల్కర్ సల్మాన్. అతను చేసే సినిమాలు తెలుగు ఆడియన్స్ కి ఐతే సూపర్ అనిపించేస్తున్నాయి. ఐతే దుల్కర్ సల్మాన్ హీరోగానే కాదు నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నారు.
డిఫరెంట్ కంటెంట్ తో దుల్కర్..
మంచి కంటెంట్ తో దుల్కర్ నిర్మాణంలో వస్తున్న సినిమాలు కూడా మెప్పిస్తున్నాయి. తన వేఫరర్ ఫిలింస్ బ్యానర్ లో సినిమాలు నిర్మించడమే కాదు వేరే భాషల సినిమాలు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ సక్సెస్ అవుతున్నాడు దుల్కర్ సల్మాన్. మంచి సినిమాను మలయాళ ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో డిస్ట్రిబ్యూటర్ గా కూడా డిఫరెంట్ కంటెంట్ సినిమాలు మలయాళంలో తెస్తున్నాడు దుల్కర్.
అలా హీరోగానే కాదు ప్రొడ్యూసర్ గా కూడా దుల్కర్ తన సత్తా చాటుతున్నాడు. దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ గా తన ప్రొడక్షన్ లో లోక సినిమా ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, నెస్లెన్ లీడ్ రోల్ లో నటించారు. డిఫరెంట్ కంటేంట్ తో వచ్చిన ఈ సినిమాను డామినిక్ అరుణ్ డైరెక్ట్ చేశాడు. సినిమా నిన్న రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
కొత్త లోక టైటిల్ తో..
లోక సినిమా తెలుగులో కూడా రిలీజైంది. ఈ సినిమాను తెలుగులో సితార నాగ వంశీ రిలీజ్ చేశారు. దుల్కర్ సల్మాన్ సినిమాలే కాదు నిర్మించిన మూవీస్ కూడా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. హీరోగా మంచి సినిమాలు చేస్తున్న దుల్కర్ నిర్మాతగా మరో మెట్టు ఎక్కే సినిమాలే చేస్తున్నాడు. తాను నటించలేక మనసుకి నచ్చిన సినిమాలు నిర్మించాలని ఫిక్స్ అయినట్లు ఉన్నాడు.
అంతేకాదు యంగ్ పీపుల్ కి ఛాన్స్ ఇస్తూ తన బ్యానర్ సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడు దుల్కర్ సల్మాన్. ఇక దుల్కర్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కాంత సినిమా చేస్తున్న దుల్కర్ ఆ నెక్స్ట్ ఆకాశంలో ఒక తార సినిమాతో వస్తున్నాడు. ఈ రెండు సినిమాల మీద మంచి అంచనాలు ఉన్నాయి. హీరోగానే కాదు నిర్మాతగా దుల్కర్ అందుకుంటున్న ఈ సక్సెస్ లు అతనికి మరింత క్రేజ్ తెచ్చి పెడుతున్నాయి. హీరో కం ప్రొడ్యూసర్ ఆ తెలుగులో నాని తన ఇంపాక్ట్ చూపిస్తుంటే.. మలయాళంలో హీరో కం ప్రొడ్యూసర్ గా దుల్కర్ అదరగొట్టేస్తున్నాడు.