లోక బడ్జెట్.. దుల్కర్ కామెంట్స్ వైరల్..!
హీరోగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూనే ఇప్పుడు నిర్మాతగా కూడా సర్ ప్రైజ్ సినిమాలు చేస్తున్నాడు దుల్కర్ సల్మాన్.;
హీరోగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూనే ఇప్పుడు నిర్మాతగా కూడా సర్ ప్రైజ్ సినిమాలు చేస్తున్నాడు దుల్కర్ సల్మాన్. అతని వేఫరర్ ఫిలింస్ బ్యానర్ లో రీసెంట్ గా వచ్చిన సినిమా లోక తెలుగులో ఈ సినిమా కొత్త లోకా టైటిల్ తో రిలీజైంది. లోక సినిమా ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అంతేకాదు రిలీజ్ వీకెండ్ లోనే సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఐతే తెలుగులో ఈ సినిమాను సరిగా ప్రమోట్ చేయకుండానే రిలీజ్ చేశారు. సినిమా ఎలాగు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది కాబట్టు కొత్త లోక ప్రమోషన్స్ మొదలు పెట్టారు.
30 కోట్లతో 300 కోట్ల స్టఫ్..
కొత్త లోక సినిమాను తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీ రిలీజ్ చేశారు. కొత్త లోక సక్సెస్ మీట్ లో నాగ వంశీ కనిపించి సినిమా హిట్ అయిన తర్వాత చెబుతున్నా ఈ సినిమా తప్పకుండా చూడండని అన్నాడు. ఐతే ఈ సినిమా సక్సెస్ విషయంలో బాగా వినిపిస్తున్న కామెంట్ దుల్కర్ లోక సినిమాను 30 కోట్లతో తీసి 300 కోట్ల స్టఫ్ అందించాడు.. అదే 300 కోట్లు తెచ్చే సినిమా తీశాడని అంటున్నారు. సక్సెస్ మీట్ లో నాగ వంశీ కూడా చూచాయగా ఇదే మాట అన్నారు.
ఐతే దుల్కర్ సల్మాన్ ఈ కామెంట్స్ కి ఆన్సర్ ఇచ్చాడు. సినిమా తాము తీసింది కూడా చాలా పెద్ద బడ్జెట్టే అని.. మలయాళంలో సినిమా ఇంత పెద్ద బడ్జెట్ తో అంటే అది పెద్ద రిస్క్ అని అన్నారు. తను చేసిన కురుపు, కింగ్ ఆఫ్ కోత సినిమా రేంజ్ బడ్జెట్ దీనికి పెట్టామని అన్నారు దుల్కర్. ఐతే పెట్టిన ప్రతి రూపాయ్ తెర మీద కనిపిస్తుందని అన్నారు.
ఒక హిట్ పడిన హీరోతోనే ఆ రేంజ్ బడ్జెట్..
బహుశా లోక తక్కువ బడ్జెట్ అనే కామెంట్స్ దుల్కర్ సల్మాన్ ని హర్ట్ చేసి ఉండొచ్చు. మలయాళంలో 30, 40 కోట్ల సినిమా అంటే అది చాలా పెద్ద బడ్జెట్ అన్నట్టే లెక్క. మన దగ్గర ఒక హిట్ పడిన హీరోతోనే ఆ రేంజ్ బడ్జెట్ పెట్టేస్తారు కాబట్టి మన వాళ్లకి అది తక్కువ బడ్జెట్ అనిపించొచ్చు. ఆ విషయంలో దుల్కర్ తప్పేమి లేదు. కానీ 30 కోట్లకు ఎంత మంచి కంటెంట్ తో సినిమా తీశామన్నది ఇక్కడ ముఖ్యం. తీసిన సినిమా గురించి డబ్బా కొట్టడం.. అంచనాలు పెంచడం కాకుండా.. కంటెంట్ ని నమ్మి బడ్జెట్ పెడితే రిజల్ట్ ఇలా వస్తుందని లోక ప్రూవ్ చేసింది.
ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ పర్ఫార్మెన్స్ గురించి కూడా అందరు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. డామెరిక్ అరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన కొత్త లోక సినిమా చాప్టర్ 1 చంద్ర సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, టోవినో థామస్ క్యామియో రోల్స్ కూడా సర్ ప్రైజ్ చేశాయి.