ప్రదీప్ 'డ్యూడ్' వసూళ్లు.. 5 రోజుల్లో ఎంతంటే?

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్.. రీసెంట్ గా డ్యూడ్ మూవీతో థియేటర్స్ లోకి వచ్చిన సంగతి విదితమే.;

Update: 2025-10-22 09:08 GMT

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్.. రీసెంట్ గా డ్యూడ్ మూవీతో థియేటర్స్ లోకి వచ్చిన సంగతి విదితమే. తెలుగు, తమిళ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆ సినిమాను ఇప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు చిత్రాలకు వర్క్ చేసిన కీర్తిశ్వరన్ తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు.




 


దీపావళి కానుకగా అక్టోబర్ 17వ తేదీన సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఆ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి రోజు డ్యూడ్ మూవీకి రూ. 22 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.

మేకర్స్ డిటైల్స్ ప్రకారం.. రెండు రోజుల్లోనే రూ.50 కోట్ల మార్క్ కు చేరువైన డ్యూడ్ మూవీ.. నాలుగు రోజుల్లో రూ.83 కోట్ల వసూళ్లను సాధించింది. దీంతో సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ లో రూ.100 కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. తాజాగా మేకర్స్ వసూళ్ల విషయంలో మరో అప్డేట్ ఇచ్చారు.

ఐదు రోజుల వసూళ్ల వివరాలను బుధవారం మేకర్స్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా రూ.95 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలిపారు. ఈ మేరకు కొత్త పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు. ఫెస్టివల్ మోడ్ ను డ్యూడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద కంటిన్యూ చేస్తున్నట్లు కూడా తెలిపారు. ప్రస్తుతం కొత్త పోస్టర్.. సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.

అయితే నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఈవెంట్ల ఖర్చులతో కలిపి డ్యూడ్ చిత్రానికి 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. రిలీజ్ కు ముందు మంచి బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో 120 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ రాబట్టాల్సి ఉందని కూడా అంచనా వేశాయి.

ఇక సినిమా విషయానికొస్తే, ప్రదీప్ రంగనాథన్ సరసన ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా నటించారు. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి కీలక పాత్ర పోషించారు. శరత్ కుమార్, హ్రిదు హరూన్, డ్రావిడ్ సెల్వం, సత్య, ఐశ్వర్య శర్మ ముఖ్యమైన రోల్స్ లో నటించారు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించగా.. నిఖిత్ బొమ్మి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. భరత్ విక్రమన్ ఎడిటర్‌ గా వర్క్ చేశారు.

Tags:    

Similar News