ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మైండ్ బ్లోయింగ్ బర్త్ డే గిఫ్ట్!

ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా క్రేజీ అప్‌డేట్‌ను పంచుకుంది.

Update: 2026-05-17 18:19 GMT

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా కన్నడ సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెర‌కెక్కిస్తోన్న‌ మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ `డ్రాగన్`. `కేజీఎఫ్`, `సలార్` చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద మాస్ యాక్షన్ ప్రభంజనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ లోని లార్జర్-ద్యాన్-లైఫ్ మాస్ ఇమేజ్‌ను వెండి తెరపై ఎలా ఆవిష్కరించ బోతున్నారనే క్యూరియాసిటీ దేశవ్యాప్తంగా ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అధికారిక అప్‌డేట్ రానే వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ముస్తాబవుతోంది.




 


ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా క్రేజీ అప్‌డేట్‌ను పంచుకుంది.

ఈ చిత్రానికి సంగీతం అందిస్తోన్న‌ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మిక్సింగ్ థియేటర్‌లో వర్క్ చేస్తున్న ఫోటోను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ..`బిగ్గెస్ట్ స్ట్రోమ్ (తుఫాను) రెడీ అవుతోంది` అంటూ మైత్రీ మూవీ మేకర్స్ పెట్టిన క్యాప్షన్ సోషల్ మీడియాలో నెటిజన్లను ఊపేస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరిం చుకుని చిత్ర ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ పక్కా ప్లాన్ చేసింది. సాధారణంగా టీజర్లు లేదా గ్లింప్స్ అంటే ఒకటి లేదా రెండు నిమిషాల నిడివితో ఉంటాయి.

కానీ ప్రశాంత్ నీల్ తారక్ అభిమానులకు భారీ విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 4 నిమిషాల 35 సెకన్ల సుదీర్ఘ నిడివితో గ్లింప్స్ ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. నిడివి నిజమైతే? ఇండియన్ సినిమా హిస్టరీలోనే గ్లింప్స్ కోసం ఇంత సమయాన్ని కేటాయించడం సరికొత్త రికార్డు కానుంది. సుదీర్ఘ గ్లింప్స్ ద్వారా దర్శకుడు ప్రశాంత్ నీల్ `డ్రాగన్` క‌థా నేపథ్యాన్ని, ఎన్టీఆర్ లుక్ అండ్ క్యారెక్టరైజేషన్‌ను పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రవి బస్రూర్ మార్క్ ఇంటెన్స్ ఎలివేషన్ మ్యూజిక్ , థంపింగ్ బిజీఎమ్ మిక్సింగ్ గ్లింప్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఎన్టీఆర్ నటన, ప్రశాంత్ నీల్ టేకింగ్ స్టైల్ కి తోడుగా రవి బస్రూర్ ఇచ్చే ఆర్ఆర్ థియేటర్లలో ఏ స్థాయి విధ్వంసం సృష్టిస్తుందో? ఊహ‌కే అంద‌దు.

ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబో నుండి వ‌స్తోన్న‌ మొదటి అధికారిక విజువల్ కంటెంట్ కావడంతో `డ్రాగన్` గ్లింప్స్ పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఇచ్చిన `స్ట్రోమ్` అప్‌డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. మరి మే 20న విడుదల కాబోతున్న 4 నిమిషాల గ్లింప్స్ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో? చూడాలి.

Tags:    

Similar News