విజయ్ కాంత్ మరణంపై అనుమానం.. డైరెక్టర్ సంచలన పోస్ట్!

ఇదిలా ఉంటే విజయ్ కాంత్ మరణం పట్ల మలయాళ ప్రేమమ్ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రేన్ తన సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది

Update: 2023-12-28 12:43 GMT

తమిళ సీనియర్ హీరో, డిఎంకె పార్టీ అధినేత విజయ్ కాంత్ అనారోగ్యంతో ఈరోజు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణ వార్తతో అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు.


ఇదిలా ఉంటే విజయ్ కాంత్ మరణం పట్ల మలయాళ ప్రేమమ్ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రేన్ తన సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. కెప్టెన్ గా ప్రజల మనసులో ముద్ర వేసుకున్న నాయకుడిని చంపేశారని అల్ఫోన్స్ తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు, హీరో ఉదయనిది స్టాలిన్ ను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ట్యాగ్ చేశాడు. ఈ మేరకు అల్ఫోన్స్ తన సోషల్ మీడియాలో పేర్కొంటూ..

" ఉదయనిధి స్టాలిన్ అన్నా.. కేరళ నుంచి చెన్నై వచ్చిన నేను, రెడ్ జెయింట్ ఆఫీసులో కూర్చుని మీరు రాజకీయాలలోకి రావాలి' అని చెప్పాను. కరుణానిధిని ఎవరు మర్డర్ చేశారో, ఐరన్ లేడీ జయలలితను మర్డర్ చేసింది ఎవరో మీరు కనిపెట్టాలని అడిగాను. ఇప్పుడు మీరు కెప్టెన్ విజయకాంత్ ను ఎవరు హత్య చేశారో కనిపెట్టాలి. వాళ్ళను పట్టుకోవాలి. ఒకవేళ మీరు ఈ విషయాన్ని విస్మరిస్తే, 'ఇండియన్ 2' సెట్స్‌లో కమల్ హాసన్ గారిని, మిమ్మల్ని హత్య చేసే ప్రయత్నం చేస్తారు.

Read more!

మీరు గనుక ఆ హంతకులను పట్టుకునే ప్రయత్నం చేయకపోతే, మిమ్మల్ని లేదా స్టాలిన్ గారిని టార్గెట్ చేస్తారు. 'నీరం' సినిమా విజయవంతమైన తర్వాత మీరు నాకు ఓ బహుమతి ఇచ్చారు, గుర్తుందా? ఐ ఫోన్ సెంటర్‌కు కాల్ చేసి 15 నిమిషాల్లో ఐ ఫోన్ బ్లాక్ కలర్ ఫోన్ తెప్పించి నాకు ఇచ్చారు. ఉదయనిధి స్టాలిన్ అన్నా.. మీకు అది గుర్తు ఉంటుందని అనుకుంటున్నా.

మర్డర్స్ చేసిన వాళ్ళను పట్టుకుని వాళ్ళ మోటివ్ ఏంటనేది తెలుసుకోవడం మీకు ఐ ఫోన్ తెప్పించడం కంటే సింపుల్'' అని రాసుకొచ్చారు. దీంతో ఆల్ఫోన్స్ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. కాగా గతంలో ఈ డైరెక్టర్ ఇలాంటి వివాదాస్పద పోస్టులు చాలానే చేశాడు. ఆ తర్వాత వెంటనే ఆ పోస్టులను డిలీట్ చేయడం గమనార్హం.

Tags:    

Similar News