వీడియో : డబుల్‌ ఇస్మార్ట్‌ డబుల్ డోస్‌

ఆ మధ్య కాస్త గ్యాప్‌ ఇచ్చిన పూరి జగన్నాధ్‌ తిరిగి షూటింగ్‌ ను ప్రారంభించడంతో వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి

Update: 2024-05-22 11:11 GMT

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ హీరోగా డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న డబుల్‌ ఇస్మార్ట్‌ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఆ మధ్య కాస్త గ్యాప్‌ ఇచ్చిన పూరి జగన్నాధ్‌ తిరిగి షూటింగ్‌ ను ప్రారంభించడంతో వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి.

ఇటీవలే రామ్‌ బర్త్‌ డే సందర్భంగా స్పెషల్‌ ట్రీట్‌ ఇచ్చిన దర్శకుడు పూరి తాజాగా ఒక మేకింగ్‌ వీడియోను విడుదల చేశాడు. మేకింగ్‌ వీడియో చూసిన తర్వాత సినిమా పై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకం ను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

ఒక సన్నివేశం కోసం వందల సంఖ్యలో జనాలను ఉపయోగించినట్లుగా మేకింగ్‌ వీడియోలో చూడవచ్చు. ప్రతి సన్నివేశం కోసం రామ్‌ ఏ స్థాయిలో కష్టపడుతున్నాడు, పూరి ఎంత కసితో తీస్తున్నాడు అనే విషయాలను కూడా ఈ వీడియో లో చూపించడం జరిగింది.

ఇక సంజయ్ దత్‌ లుక్ తో పాటు ప్రతి విషయంలో కూడా పూరి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. హీరోయిన్‌ గా ఈ సినిమాలో కావ్య థాపర్ నటిస్తుంది. అలీ ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత ఒక ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ రోల్‌ ను చేస్తున్నాడు. డిఫరెంట్‌ గెటప్ లో అలీని చూడవచ్చు.

Read more!

ఈ సినిమాను ఛార్మితో కలిసి సొంత బ్యానర్ లో స్వయంగా పూరి భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన విడుదల తేదీ కోసం ఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తున్నారు. మరి కొత్త విడుదల తేదీని ఎప్పుడు ఇస్తారు అనేది చూడాలి.

మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా రూపొందుతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో అంతకు మించి అన్నట్లుగా డబుల్ ఇస్మార్ట్ ను రూపొందిస్తున్నారు. మేకింగ్ వీడియో చూసిన తర్వాత చాలా మంది డబుల్ ఇస్మార్ట్ డబుల్ డోస్ అంటున్నారు.

Full View
Tags:    

Similar News