సుకుమార్ మెప్పు పొందిన సాంగ్..!
ఈ సాంగ్ ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.;
యువ నటులు సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ లీడ్ రోల్స్ లో కార్తికేయ కొమ్మి డైరెక్షన్ లో వస్తున్న సినిమా దూరదర్శని. ఈ సినిమాను వరాహా మూవీ మేకర్స్ బ్యానర్ లో సాయి ప్రతాప్ రెడ్డి, జయ శంకర్ రెడ్డి నిర్మితున్నారు. సినిమా నుంచి ఇప్పటికే మొదటి సాంగ్ నానీడ వెళుతోందా రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా లేటెస్ట్ గా సినిమా నుంచి మరో సాంగ్ అపన్నా తిన్నామన్నా సాంగ్ రిలీజ్ చేశారు.
ఈ సాంగ్ ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సాంగ్ రిలీజ్ సందర్భంగా హీరో సువిక్షిత్ సినిమాల మీద చాలా ప్యాషన్ గల వ్యక్తి. సాంగ్ చాలా బాగుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి సక్సెస్ గుర్తింపు రావాలని అన్నారు సుకుమార్.
ఇక ఈ సందర్భంగా హీరో సువిక్షిత్ మాట్లాడుతూ.. తన సినిమా సాంగ్ ని ఫేవరైట్ డైరెక్టర్ సుకుమార్ గారు రిలీజ్ చేయడం గొప్పగా భావిస్తున్నానని అన్నారు. దూరదర్శని సినిమా ఆడియన్స్ ని 1990ల కాలానికి తీసుకెళ్తుందని అన్నారు. అంతేకాదు ఆ టైం లో ప్రతి ఒక్కరి ప్రేమకథలను గుర్తు చేస్తుందని చెప్పుకొచ్చారు. 90ల నేపథ్యంతో ఆ టైం లో జరిగిన ప్రేమ కథగా ఈ సినిమా వస్తుందని. సినిమాకు సరైన కాస్టింగ్ కుదిరిందని సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని అన్నారు సువిక్షిత్. టైటిల్ కి తగినట్టుగానే కథా నేపథ్యం.. అందుకు తగినట్టుగానే ఈ అప్పన్నా తన్నామన్నా సాంగ్ ఉన్నట్టు ఉన్నాయి. ఈ సాంగే ఒక వింటేజ్ వైబ్ ని కలిగేలా చేస్తుంది.
దూరదర్శని సినిమాకు ఆనంద్ గురురాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఈ అప్పన్నా తన్నామన్నా సాంగ్ కి సురేష్ బనిశెట్టి లిరిక్స్ అందించగా సింధుజా శ్రీనివాసన్ ఆలపించారు. సుకుమార్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన అప్పనా తన్నామన్నా సాంగ్ రిఫ్రెషింగ్ గా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ చేయనున్నారు.
సుకుమార్ చేతుల మీదుగా సాంగ్ రిలీజ్ చేయడంతో దూరదర్శని సినిమా గురించి ఆడియన్స్ లో డిస్కషన్ మొదలవుతుందని చెప్పొచ్చు. స్టార్ సినిమా అయినా చిన్న సినిమా అయినా చేస్తున్న ప్రాజెక్ట్ జనాల్లోకి వెళ్లాలంటే స్టార్ కాంపెయినింగ్ చాలా అవసరం. అందుకే సాంగ్ రిలీజ్ నుంచే సెలబ్రిటీల ద్వారా ప్రేక్షకుల్లో సినిమాను చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. దూరదర్శని సినిమా విషయంలో టైటిల్ ఇంప్రెసివ్ గా ఉండగా రిలీజైన సాంగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. మరి సినిమా నిజంగానే 90ల జ్ఞాపకాలను గుర్తు చేస్తుందా లేదా అన్నది చూడాలి.