బ్లాక్ బస్టర్ సిరీస్ కోసం గ్లోబల్ బ్యూటీ బరిలోకా?
బాలీవుడ్ హిట్ ప్రాంచైజీ 'డాన్' సిరీస్ నుంచి 'డాన్ 3'కి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే.;

బాలీవుడ్ హిట్ ప్రాంచైజీ 'డాన్' సిరీస్ నుంచి 'డాన్ 3'కి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. ఈసారి 'డాన్' గా రణవీర్ సింగ్ బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటికే కొన్ని నెలలుగా పర్హాన్ అక్తర్ ఈ ప్రాజెక్ట్ పైనే పని చేస్తున్నాడు. గత రెండు భాగాలను మించి నెక్స్ట్ లెవల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేసి పనిచేస్తున్నాడు. స్క్రిప్ట్ పర్పెక్షన్ కోసం ఎంతో శ్రమిస్తున్నాడు. చివరిగా స్క్రిప్ట్ లాక్ అవ్వడంతో తదుపరి పనులు మొదలు పెట్టాడు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రీ టీజర్ కూడా రిలీజ్ చేసి అంచనాలు రెట్టింపు చేసారు.
అయితే ఈ సారి 'డాన్' తో రొమాన్స్ చేసే బ్యూటీ విషయంలో ఇంత వరకూ ఎలాంటి క్లారిటీ రాలేదు. చాలా మంది భామల పేర్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా పేరు కూడా తెరపైకి వస్తోంది. పర్హాన్ ఆమెతో కూడా చర్చలు జరుపుతున్నాడుట. పీసీ ఎంట్రీ ఇస్తే గనుక డాన్ ఇమేజ్ అంతకంతకు రెట్టింపు అవుతుంది. ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో ఫేమస్ అయిన నటి కాబట్టి అంతర్జా తీయంగానూ 'డాన్ 3'ని కనెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
దీనిలో భాగంగానే పర్హాన్ పీసీకి కూడా టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ప్రియాంక నుంచి మాత్రం ఇంకా ఎలాంటి గ్రీన్ సిగ్నెల్ రాలేదుట. ఇద్దరి మధ్య ఇదింకా చర్చగానే ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారుట. ఈలోగా ప్రీ ప్రొడక్షన్ అంతా సిద్దం చేసుకుని రెడీగా ఉండమని రణవీర్ సింగ్ కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు తెలు స్తోంది. రణవీర్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. డాన్ మొదలైన నాటి నుంచి ఆ సినిమాపైనే పని చేయనున్నాడు.
రణవీర్ సింగ్ కెరీర్ లో ఎన్నో సాహసోపేతమైన పాత్రలు..వైవిథ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పిం చాడు. 'డాన్' తరహా సినిమాలు మాత్రం పోషించలేదు. ఈనేథ్యంలో అలాంటి ఛాన్స్ ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తోన్న సమయంలో పర్హాన్ అక్తర్ మీట్ అవ్వడం...రణవీర్ సింగ్ మరో ఆలోచన లేకుండా ఒకే చెప్పడం జరిగింది.