టాలీవుడ్ ఆరంగేట్రంపై పంజాబీ నటి ఎమోషనల్
`మయసభ` అనే పొలిటికల్ వెబ్ సిరీస్ తో తెలుగు తెరకు పరిచయమైంది నటి దివ్యా దత్తా.;
`మయసభ` అనే పొలిటికల్ వెబ్ సిరీస్ తో తెలుగు తెరకు పరిచయమైంది నటి దివ్యా దత్తా. దేవకట్టా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో దివ్య దత్తా నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ లో నటీనటుల ప్రదర్శన, కంటెంట్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. సిరీస్ సక్సెస్ ని ఆస్వాధిస్తున్న దివ్య దత్తా తాజాగా ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇలాంటి మరిన్ని అవకాశాల కోసం వేచి చూస్తున్నానని, టాలీవుడ్ సహా ప్రాంతీయ భాషల్లో నటించాలనుందని అన్నారు.
ఇది బ్లాక్ బస్టర్ అని ప్రజలు అంటుంటే ఆనందంగా ఉంది. నాకు రోజూ చాలా సంక్షిప్త సందేశాలొస్తున్నాయి అని అన్నారు. ఈ సిరీస్ లో దివ్య దత్తా పాత్ర ఆంగ్లం మాట్లాడుతుంది. అయినా దీనికోసం చాలా వర్క్ చేసానని ఆమె తెలిపారు. టోన్ .. బాడీ లాంగ్వేజ్.. భావ వ్యక్తీకరణ ప్రతిదీ నేర్చుకోగలిగానని అన్నారు. ఇకపైనా తెలుగు లైన్లు ఉత్సాహంగా పలకడానికి ప్రయత్నిస్తానని కూడా దివ్య దత్తా పేర్కొన్నారు.
`మయ సభ` సిరీస్ రచయితల పనితనం అద్భుతం. చక్కని వైభవం.. భావోద్వేగాలను పలికించిన విధానం వెబ్ సిరీస్ విజయానికి కారణమని కూడా దివ్య దత్తా విశ్లేషించారు. నటీనటుల నుంచి చక్కని భావోద్వేగాలను రాబట్టుకోవడంలో దర్శకుడు విజయవంతమయ్యారని కూడా ప్రశంసించారు. దివ్యాదత్తా సీనియర్ నటీమణి. పంజాబ్ స్వస్థలం. బాలీవుడ్ సహా పంజాబీ, నేపాళి చిత్రాల్లోను నటీమణిగా కొనసాగారు.