ఓల్డ్‌ వీడియో : సముద్రపు అందాల దివి

కానీ బిగ్‌ బాస్ లో ఎప్పుడైతే ఈ అమ్మడు కనిపించిందో అప్పటి నుంచి కూడా సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి పేరు మారుమోగుతూనే ఉంది.

Update: 2024-05-10 15:30 GMT

తెలుగు బిగ్ బాస్ ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ దివి. అంతకు ముందు పలు సినిమాల్లో నటించిన కూడా ఏ ఒక్కటి ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టలేక పోయాయి. కానీ బిగ్‌ బాస్ లో ఎప్పుడైతే ఈ అమ్మడు కనిపించిందో అప్పటి నుంచి కూడా సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి పేరు మారుమోగుతూనే ఉంది.


దివి పాప అంటూ నెటిజన్లు ముద్దుగా పిలుచుకునే ఈమె షేర్ చేసిన ప్రతి ఫోటో ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉంటారు. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం. తెలుగు అమ్మాయి అయ్యి ఉండకుంటే కచ్చితంగా టాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు ఈ అమ్మడు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ అయ్యేది అనేది కొందరి అభిప్రాయం.

ఆ విషయం పక్కన పెడితే రెగ్యులర్‌ గా దివి సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఈ అమ్మడి యొక్క వీడియోలు కూడా వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఓ ఓల్డ్‌ వీడియో తో దివి నెట్టింట వైరల్‌ అయ్యింది.

దాదాపు అయిదు సంవత్సరాల క్రితం వీడియో అంటూ ఈ వీడియోను దివి షేర్‌ చేసింది. గోవా బీచ్ లో 'దోబూచులాట' అనే ప్రాజెక్ట్‌ షూటింగ్ కు వెళ్లిన సమయంలో తీసిన వీడియో అంటూ దివి ఈ వీడియోను షేర్ చేసింది. ఐ లవ్‌ సారీస్‌, ఐ లవ్‌ ట్రెడీషనల్‌ వేర్‌ అంటూ దివి పోస్ట్‌ చేసింది.

Read more!

వీడియో లో దివి ప్రస్తుతం తో పోల్చితే సన్నగా నాజూకుగా కనిపిస్తుంది. నడుము అందం చూపిస్తూ కవ్విస్తుంది. అంతే కాకుండా చీర కట్టు లో సరికొత్తగా కనిపిస్తుందని, బ్లాక్‌ బ్లౌజ్ తో చూపరుల దృష్టిని ఆకర్షిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తున్న దివికి దక్కాల్సిన ఆఫర్లు దక్కడం లేదు అనేది చాలా మంది అభిప్రాయం.



Tags:    

Similar News