బుల్లితెర దేవుళ్ళు.. వెండితెర వెలుగులు..!

ఈమధ్య స్టార్ సినిమాల్లో ఎక్కువ డివైన్ టచ్ కనిపిస్తుంది. నేషనల్ లెవెల్ లో రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఈ ఇంపాక్ట్ ఎక్కువ కనిపిస్తుంది.;

Update: 2025-12-14 08:42 GMT

ఈమధ్య స్టార్ సినిమాల్లో ఎక్కువ డివైన్ టచ్ కనిపిస్తుంది. నేషనల్ లెవెల్ లో రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఈ ఇంపాక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. రామాయణ, మహాభారత కథలతో పాటు కొన్ని ఆధ్యాత్మిక విషయాలను కూడా తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ సౌత్ లో తక్కువ కానీ హిందీలో ఇలాంటి కథలను బుల్లితెర ప్రేక్షకులకు అందిస్తూనే ఉన్నారు. అక్కడ మహాభారతం, శ్రీ కృష్ణ లాంటి సీరియల్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ అక్కడ ఇలాంటి సీరియల్స్ స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ ని మెప్పిస్తున్నాయి.

స్మాల్ స్క్రీన్ పై దేవుని పాత్రల్లో..

ఐతే అందులో నటించే నటీనటులు కూడా బాగా ఇంపాక్ట్ చూపిస్తున్నారు. శ్రీ కృష్ణ, మహాభారత్ సీరియల్స్ లో నటించిన సౌరబ్ రాజ్ జైన్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్ గా తరుణ్ ఖన్నా కూడా ఇలాంటి డివోషనల్ రోల్స్ చేస్తున్నారు. ఐతే స్మాల్ స్క్రీన్ పై దేవుని పాత్రల్లో మెప్పించిన వీరిని సినిమాల్లో అలాంటి పాత్రలనే చేసేలా ప్రోత్సహిస్తున్నారు.

కింగ్ నాగార్జున చేసిన ఓం నమో వెంకటేశాయ సినిమాలో వెంకటేశ్వర స్వామిగా సౌరబ్ రాజా జైన్ చేశారు. ఇక రీసెంట్ గా అఖండ 2 సినిమాలో శివుని పాత్రలో తరుణ్ ఖన్నా నటించారు. సినిమా గురించి అంతా పక్కన పెడితే అఖండ 2 లో తరుణ్ ఖన్నా వచ్చిన పోర్షన్స్ మాత్రం ఇంప్రెస్ చేశాయి.

స్మాల్ స్క్రీన్ లో ఇలా ఆధ్యాత్మిక సీరియల్స్ చేస్తూ వస్తున్న వాళ్లకి ఇలా స్టార్ ఛాన్స్ లు రావడం లక్కీ అని చెప్పొచ్చు. రాముడు, శివుడు, వెంకటేశ్వరుడు ఇలాంటి పాత్రల్లో ఎవరిని పడితే వాళ్లను పెట్టే అవకాశం ఉండదు. ఆల్రెడీ సీరియల్స్ లో దేవుడిగా ఆడియన్స్ ని మెప్పిస్తున్నారు కాబట్టి ఆ పాత్రలకు వాళ్లనే తీసుకొస్తున్నారు.

నాగార్జున కూడా శిరిడీ సాయి సినిమాలో..

ఇదో విధంగా అలాంటి పాత్రలు చేస్తున్న వారికి కూడా మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఒకప్పుడు తెర మీద సాయి బాబా అంటే చాలా విజయ చందర్ ని తీసుకొచ్చే వారు. ఐతే మన నాగార్జున కూడా శిరిడీ సాయి సినిమాలో బాబాగా నటించి అదరగొట్టారు. సో బుల్లితెర మీద దేవుళ్లుగా నటిస్తున్న హిందీ నటులను మన తెలుగు మేకర్స్ సరైన పాత్రలకే వాడుకుంటున్నాని చెప్పొచ్చు. అఖండ 2 తో తరుణ్ ఖన్నా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారారు. శివునిగా ఆయన అభినయం ఆకట్టుకుంది. సీరియల్స్ లోనే కాదు ఇలా తెర మీద కూడా వారు చేస్తున్న దేవుళ్ల పాత్రలకు సంబంధించిన నటీనటులు అదరగొట్టేస్తున్నారని చెప్పొచ్చు.

నెక్స్ట్ రాబోతున్న సినిమాల్లో కూడా దేవుళ్ల పాత్రలకు ఇలా సీరియల్ రిఫరెన్స్ లతోనే కాస్టింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కథలో వారి పాత్ర కీలకం అయినప్పుడు వచ్చే రెండు మూడు సీన్స్ అయినా ఒక ఇంపాక్ట్ చూపించాలి అంటే మాత్రం అది కచ్చితంగా దానిలో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిన నటీనటులే చేయాలి. అప్పుడే అలాంటి పాత్రలకు ఒక పరిపూర్ణత ఏర్పడుతుంది.

Tags:    

Similar News