దేవ‌తా సుంద‌రి దివ్య‌ద‌ర్శ‌నం ఇలా అయింది

కొన్నేళ్లుగా బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టానీ అన్ లిమిటెడ్ గ్లామ‌ర‌స్ ట్రీట్ కి అభిమానులు అడిక్ట్ అయిపోయిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-11-20 10:47 GMT

కొన్నేళ్లుగా బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టానీ అన్ లిమిటెడ్ గ్లామ‌ర‌స్ ట్రీట్ కి అభిమానులు అడిక్ట్ అయిపోయిన సంగ‌తి తెలిసిందే. సీకే(కెల్విన్ క్లెయిన్) దేవ‌తా సుంద‌రిగా యువ‌ హృద‌యాల‌లో గుడి క‌ట్టుకుంది. సీకే బ్రాండ్ లోదుస్తుల‌ను ధ‌రించి ఎప్ప‌టికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్ల‌తో దిశా అంత‌ర్జాలంలో గుబులు రేపుతూనే ఉంది. ఒక్క సీకే బ్రాండ్ తోనే ఈ బ్యూటీ కోట్లాది రూపాయ‌ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది.




 


అదంతా అటుంచితే, దిశా ప‌టానీ బికినీ షూట్లు, మోనోకినీ షూట్ల‌కు అంత‌ర్జాలంలో ఉన్న గిరాకీ గురించి విధిత‌మే. ప‌ర్ఫెక్ట్ ఫిట్ బాడీతో ఫోటోషూట్ల క్వీన్‌గా దిశా ప‌టానీ మైండ్ బ్లాకింగ్ ట్రీట్ నిరంత‌రం హీటెక్కిస్తూనే ఉంది. తాజాగా దిశా ప‌టానీ నెవ్వ‌ర్ బిఫోర్ హా* లుక్ లో ప్ర‌త్య‌క్ష‌మైంది. అంద‌మైన మంచి ముత్యాలు, మిరుమిట్ల క్రిస్ట‌ల్స్ తో తీర్చిదిద్దిన అద్భుత‌మైన శారీ లుక్ లో ప‌టానీ మ‌తులు చెడ‌గొడుతోంది. గోల్డ్ క‌ల‌ర్ శారీ, డిజైన‌ర్ రివీలింగ్ బ్లౌజ్ లో దిశా దేవ‌తా సుంద‌రిని త‌ల‌పిస్తోంది.




 


దిశా ఈ కొత్త లుక్ లో మ‌తులు పోగొడుతోంది. రంభ‌, ఊర్వశి, మేన‌క, తిలోత్త‌మ‌లు సైతం కుళ్లుకునేంత అందంగా ఉందంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ యూనిక్ ఫోటోషూట్ యువ‌త‌రంలో వైర‌ల్ గా మారుతోంది. ముత్యాలు, ఆభ‌ర‌ణాల‌తో అందంగా అల్లిన మ‌యూరంలా హృద‌యాల‌ను మీటుతోంద‌ని యూత్ ఫిదా అయిపోతున్నారు.




 


దిశా కెరీర్ మ్యాట‌ర్‌కి వ‌స్తే... చివ‌రిగా ఈ బ్యూటీ `క‌ల్కి 2898 ఏడి`లో క‌నిపించింది. కొన్ని ఫ్లాపు సినిమాల కార‌ణంగా దిశా సౌండ్ సౌత్ లో అంత‌గా వినిపించ‌డం లేదు. అక్షయ్ కుమార్, రవీనా టాండన్, అనిల్ కపూర్, సంజయ్ దత్, సునీల్ శెట్టిలతో కలిసి న‌టిస్తున్న‌ `వెల్కమ్ టు ది జంగిల్` చిత్రీక‌ర‌ణ సాగుతోంది. హోలీగార్డ్స్ సాగా - `ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్` అనే అంతర్జాతీయ చిత్రంలోను దిశా కనిపిస్తుంది. అతీంద్రియ శ‌క్తుల నేప‌థ్యంలో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌కి కెవిన్ స్పేసీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది డిసెంబర్ 20న విడుదల కానుంది.

Tags:    

Similar News