హాట్ అందాలతో కట్టిపడేస్తున్న దిశా పటానీ!

ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న దిశాపటానీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.;

Update: 2025-10-20 13:30 GMT

భాషతో సంబంధం లేకుండా ప్రతి భాషా ప్రేక్షకుడికి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ.. తమ అందంతో, నటనతో కట్టిపడేస్తున్నారు ఎంతోమంది భామలు. ఇండస్ట్రీలోకి రావాలనే కోరికతో సోషల్ మీడియాలో కూడా భారీ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. కొంతమంది సినీ బ్యాక్ గ్రౌండ్ ఉండి ఇండస్ట్రీలోకి అడుగు పెడితే.. మరికొంతమంది స్వతహాగా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఇండస్ట్రీలో తమకంటూ ఒక పేరు వచ్చిన తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకోవడానికి సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకుంటున్నారు.



 

అందులో భాగంగానే తాజాగా గ్లామర్ వలకబోస్తూ ఫోటోలు షేర్ చేస్తూ కుర్ర కారుకు చెమటలు పట్టిస్తున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న దిశాపటానీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ విందు వడ్డిస్తూ అలరిస్తోంది. ఈ క్రమంలోని తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో మంట రాజేస్తున్నాయి. తాజాగా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చిన ఈమె.. హాట్ అందాలతో సోషల్ మీడియాలో మంట పెట్టేసింది. అలాగే బ్యాక్ లెస్ వీపు చూపిస్తూ గిలిగింతలు పెట్టింది దిశాపటానీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.



 


దిశాపటానీ కెరియర్ విషయానికి వస్తే.. జార్ఖండ్ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అలా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమా ద్వారా 2015లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్న ఈమె..2016లో ఎంఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ సినిమాలో నటించి అటు హిందీ ప్రేక్షకులను కూడా పలకరించింది. తెలుగులో చేసింది ఒక చిత్రమే అయినా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈమె మళ్ళీ తెలుగులో కనిపించలేదు. కనీసం ఇప్పటికైనా తెలుగులో అవకాశాలు అందుకోవాలని అభిమానులు కోరుతున్నారు.



 


ఇదిలా ఉండగా.. గత నెల 12వ తేదీన దిశాపటాని ఇంటి ముందు కొంతమంది దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దీంతో వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. విషయంలోకి వెళ్తే.. దిశాపటాని సోదరి కుష్బూ పటానీ ఒక వర్గం వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతోనే ఈమె ఇంటి ముందు కాల్పులు జరిపారట. మరొకవైపు ఈ కాల్పులు జరిపింది తామే అంటూ గోల్టీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించింది. కుష్బూ ఎవరో కాదు మాజీ ఆర్మీ అధికారిణి. ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్ గా పనిచేస్తుంది. ఇకపోతే వీరి ఇంటిపై జరిగిన కాల్పులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి స్పందించి త్వరలోనే నిందితులను పట్టుకుంటాం అంటూ తమ కుటుంబానికి హామీ ఇచ్చినట్లు దిశాపటాని తండ్రి వెల్లడించారు.

Tags:    

Similar News