• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  KGF వెంకటేష్ మహా.. మళ్ళీ...

KGF వెంకటేష్ మహా.. మళ్ళీ మండింది

| యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ సినిమాపై దర్శకుడు, నిర్మాత వెంకటేశ్ మహా అప్పట్లో చేసిన వ్యాఖ్యలు వైరలైన విషయం తెలిసిందే

By - Tupaki Desk
Update: 2023-12-12 05:20 GMT

యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ సినిమాపై దర్శకుడు, నిర్మాత వెంకటేశ్ మహా అప్పట్లో చేసిన వ్యాఖ్యలు వైరలైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయనపై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. వాటికి క్లారిటీ కూడా వచ్చారయన. అయితే తాజాగా ఎక్స్( అప్పటి ట్విట్టర్ ) వేదికగా తనను ట్రోల్స్ చేస్తున్న వాళ్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు వెంకటేశ్ మహా. అసలేమైందంటే..

కేరాఫ్ కంచరపాలెం సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు వెంకటేశ్ మహా. ఆ తర్వాత ఉమామహేశ్వర ఉగ్రరూపస్య తీశారు. అయితే ఆయనలో దర్శకుడు మాత్రమే కాదు.. నటుడు నిర్మాత కూడా ఉన్నారు. సంపూర్ణేశ్ బాబు హీరోగా నటించిన మార్టిన్ లూథర్ కింగ్ మూవీని ఆయనే సమర్పించారు. నాని అంటే సుందరానికి సినిమాలో కూడా యాక్ట్ చేశారు.

అయితే నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా హాయ్ నాన్న తనకు ఎంతో నచ్చిందని వెంకటేశ్ మహా తాజాగా ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ కు ఓ నెటిజన్ రెండు సినిమాలు తీసి కేజీఎఫ్ మీద కామెంట్లు చేశారని విమర్శించారు. దీంతో వెంకటేశ్ అతడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

''వదిలేస్తే మాట వినరుగా మీరు. సరే చెప్తున్నా వినండి. ఎన్ని సినిమాలు తీశాం అనేది ముఖ్యం కాదు. ఏం సినిమా తీశాం అనేది ముఖ్యం. తెలుగులోని బెస్ట్ సినిమాల్లో కొన్ని నేను తీశానని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇంకా బెస్ట్ సినిమాలు తీస్తాను. ఊరుకుంటున్నాం కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇంక ఊరుకోను'' అని వెంకటేశ్ ట్వీట్ చేశారు.

ఎలాంటి బెదిరింపులనైనా దాటుకుని తాను పైకి ఎదుగుతానని వెంకటేశ్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న ట్రోల్స్ పై పోరాటం చేస్తానని చెప్పారు. చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటానని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఎవరనేది తెలియకుండా, తమ ముఖాన్ని బయట పెట్టకుండా పోస్టులు చేస్తున్న వ్యక్తులకు బుద్ధి చెప్పే క్రమంలో తనను అండగా నిలబడాలని ఆయన కోరారు.

కొన్ని నెలల క్రితం వెంకటేశ్‌ మహా ఓ చర్చా వేదికలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన కేజీఎఫ్‌పై కామెంట్స్‌ చేశారు. ‘తల్లి కలను నెరవేర్చడం కోసం బంగారాన్ని సంపాదించి చివరికి ఆ మొత్తాన్ని సముద్రంలో పడేశాడు. అలాంటి వ్యక్తి గురించి సినిమాలు చేస్తే మనం చప్పట్లు కొడుతున్నాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు, ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ఇది చర్చనీయాంశం కాగా.. తాను ఓ ఇండస్ట్రీని కించపరిచేందుకు అలా మాట్లాడలేదని, సినిమాలోని కల్పిత పాత్రనే తప్ప వ్యక్తిని దూషించలేదని వెంకటేశ్‌ అప్పుడే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు నెటిజన్‌ కామెంట్‌ వల్ల మరోసారి నెట్టింట ఆ చర్చ మొదలైంది.

Tags:    
  • KGF 
  • Yash 
  • Filmindustry 
  • Venkateshmaha 
  • HiNanna 
  • Nani 
  • Twitter 
  • Directorvenkateshmaha 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS