• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ దర్శకుల ఫోకస్ మొత్తం...

ఆ దర్శకుల ఫోకస్ మొత్తం బాలయ్యపైనే..

| అంతేకాదు ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకొని కమర్షియల్ గాను సక్సెస్ సాధించాయి. దాంతో ఇండస్ట్రీలో బాలయ్య మార్కెట్ భారీగా పెరిగిపోయింది.

By - Tupaki Desk
Update: 2023-12-15 02:45 GMT

టాలీవుడ్ సీనియర్ హీరోలందరిలో నందమూరి ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. గత రెండేళ్లుగా ఈ హీరో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. దీంతో ఇండస్ట్రీలో భారీ డిమాండ్ ఉన్న హీరోగా బాలయ్య నిలుస్తున్నారు. అలాగే కమర్షియల్ డైరెక్టర్స్ కి నెంబర్ వన్ ఛాయిస్ గా బాలయ్య పేరే ఫస్ట్ ఉండడం విశేషం. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి.. ఈ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు బాలయ్య.

అంతేకాదు ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకొని కమర్షియల్ గాను సక్సెస్ సాధించాయి. దాంతో ఇండస్ట్రీలో బాలయ్య మార్కెట్ భారీగా పెరిగిపోయింది. అంతేకాదు స్టార్ హీరోలు కమర్షియల్ డైరెక్టర్స్ కి అందుబాటులో లేకపోవడంతో వాళ్లకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గా మారారు బాలయ్య. బోయపాటి శ్రీను, బాబి, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, పూరి జగన్నాథ్, సంపత్ నంది..

ఇలాంటి కమర్షియల్ డైరెక్టర్స్ తో పాటు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తీసే చాలామంది డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఈ జనరేషన్ లో ఉన్న టాప్ 6 స్టార్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో కమర్షియల్ గా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్న బాలయ్య ఆ డైరెక్టర్స్ కి నెంబర్ వన్ ఛాయిస్ గా నిలిచాడు. పైన పేర్కొన్న టాప్ 6 స్టార్ హీరోలు ఈతరం స్టార్ డైరెక్టర్స్ అయిన త్రివిక్రమ్, రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగ, బుచ్చిబాబు.. లాంటి సెలెక్టెడ్ డైరెక్టర్స్ తో మాత్రమే సినిమాలు చేస్తున్నారు.

రెగ్యులర్ మాస్ డైరెక్టర్స్ తో ఈ హీరోలు కలిసి పని చేయకపోవడంతో వాళ్లు సీనియర్ స్టార్స్ వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాలంటే భారీ రెమ్యునరేషన్ అడుగుతాడు. కాబట్టి అది సినిమా బడ్జెట్ పై ప్రభావం చూపుతుంది. 100 కోట్ల బడ్జెట్ సినిమా అయితే నాగార్జున, వెంకటేష్, రవితేజల మార్కెట్ పనిచేయదు. కాబట్టి ఈ దర్శకులందరికీ మన బాలయ్యే నంబర్ వన్ ఛాయిస్ అయిపోయాడు.

అందుకే బాలయ్యతో సినిమాలు చేసేందుకు కమర్షియల్ డైరెక్టర్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. బాలయ్య తో అయితే 100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమా చేయొచ్చు. దానికి తోడు ఆయన రెమ్యునరేషన్ కూడా రీజనబుల్ గా అంటే దాదాపు 30 కోట్ల కంటే తక్కువ ఉంటుంది. ఈ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి మేకర్స్ కి ఇటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి బాలయ్యతో సినిమా చేస్తే మేకర్స్ కి ఎలాగైనా లాభమే తప్పితే నష్టం అనేది ఉండదు.

Tags:    
  • Tollywood 
  • Nandamuri 
  • Balakrishna 
  • Actor 
  • Senioractor 
  • Director 
  • Commercialmovies 
  • Remuneration 
  • Collections 
  • Boxoffice 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS