అధికారికంగా చెప్పలేదు కానీ చేసేది అలాగే!
కానీ సినిమాలు తీయడం లేదు. మీ తీరు చూస్తుంటే సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు కనిపిస్తుం దన్నాడు. నాలాంటి మీ అభిమానులు ఎంతో మంది ఇదే మాట్లాడుకుంటున్నారు.;
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నుంచి సినిమా రిలీజ్ అయి ఏడాది దాటింది. `వ్యూహం` తర్వాత మరో సినిమా చేయలేదు. బాలీవుడ్ లో `పోలీస్ స్టేషన్ మెయిన్ భూట్` చిత్రాన్ని పట్టాలెక్కించాడు. కానీ ఆ సినిమా ఎంత వరకూ వచ్చిందన్నది తెలియదు. ఇదే ప్రోసస్ లో ఐదేళ్ల తర్వాత సారీ అనే సినిమా కూడా నిర్మించాడు. ఇక డైరెక్టర్ గా వర్మ అందుకున్న సక్సస్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు. వికీపీడియా తిర గేసినా సక్సెస్ ని భూతద్దం పెట్టి వెతికినా దొరకదు. అదే సోషల్ మీడియాలోకి వెళ్తే వర్మ ఇంటర్వ్యూ వీడియోలు మాత్రం పుంకాలు పుంకాలు గా కనిపిస్తాయి.
ఇంటర్వ్యూలతో బిజీ:
ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ఆయన లాజిక్కులు వైరల్ అవుతుంటాయి. అన్ని సిటీల్లో కన్నా పబ్లిసిటీ ఎక్కువంటే ?ఇష్టమని ఆ వీడియోలు చూసిన ప్రతీసారి శకలక శంకర్ స్కిట్ గుర్తొస్తుంది. ప్రస్తు తం వర్మ ఏం చేస్తున్నారు? అంటే యూట్యూబ్ ఛానళ్లకు ఇస్తున్నారు అనే మాట తప్ప సినిమా అనే చ ర్చ ఎక్కడా జరగడం లేదు. మీడియాలో ఉండటం తప్ప సినిమాలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ సినారేని ఉద్దేశించి వర్మ అభిమాని ఒకరు? ఏంటి సార్ ఏమైపోయారు? ఇండస్ట్రీలో ఉంటున్నారు.
అభిమానుల మధ్య `వర్మ` డిస్కషన్:
కానీ సినిమాలు తీయడం లేదు. మీ తీరు చూస్తుంటే సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు కనిపిస్తుం దన్నాడు. నాలాంటి మీ అభిమానులు ఎంతో మంది ఇదే మాట్లాడుకుంటున్నారు. మన వర్మ సినిమా ఏది అని ఆప్యాయంగా మరో అభిమాని పలకరిస్తే? మధ్యలో మరొకరొచ్చి ఇంకెక్కడ వర్మ ఆయన పనైపోయింది? ఇంకా `శివ` అనే చెట్టు పేరు చెప్పుకుని ఇంకెత కాలం చెలామణి అవుతారు. ఆయన సీన్, సినిమా రెండు అయిపోయింది. పరిశ్రమలో పేరుకే ఉన్నారు తప్ప సినిమాల నుంచి శాశ్వతంగా విరమణ తీసుకుం టున్నారని అభిమానులే మార్కెట్ లో మాట్లాడుకుంటున్నారు.
హిట్ కొడతారా? లేదా?
సక్సెస్ లు లేకపోవడంతోనే వర్మ గురించి జనాలంతా ఇలా మాట్లాడుకుంటున్నారని మరో అభిమాని ముం దుకొచ్చాడు. ఇంకో డైహార్డ్ అభిమాని అన్నా నువ్వు హిట్ కొట్టిన తర్వాత నేను మాట్లాడుతానంటున్నాడు. కొట్టిన తర్వాత కాలరెగరేసి వర్మ మా గురువని గర్వంగా చెబుతానని ఇంకొకరు మందుకొచ్చారు. మరి ఇంత మంది అభిమానుల్ని సంపాదించిన వర్మ ఒక్క హిట్ కొడతాడా? లేదా? ఆ పెరుమాళ్లకే ఎరుక.