అతడి డ్రీమ్ మరోకరి మాత్రమే సాధ్యం!
టాలీవుడ్ లో ఓ నలుగురు సీనియర్ హీరోలతో భారీ మల్టీస్టారర్ సినిమా చేయాలన్ని ఓ డైరెక్టర్ డ్రీమ్.;
టాలీవుడ్ లో ఓ నలుగురు సీనియర్ హీరోలతో భారీ మల్టీస్టారర్ సినిమా చేయాలన్ని ఓ డైరెక్టర్ డ్రీమ్. ఇంతవరకూ ఇలాంటి ఆలోచన ఏ దర్శకుడు కూడా చేయలేదు. దర్శకుడిగా అనుభవం తక్కువే అయినా తొలిసారి ఆ నలుగుర్ని ఒకే ప్రేమ్ లో చూపించాలి అన్న అతడి ఐడియా మాత్రం గొప్పదే. అప్పటికే ఓ సీనియర్ హీరోని డైరెక్ట్ చేసిన అనుభవం కూడా ఉంది. దీంతో మిగతా ముద్దుర్ని ఒప్పించగలిగితే మల్టీస్టారర్ పెద్ద కష్టం కాదనుకున్నాడు. కానీ ఒక్క సినిమా ఆ డైరెక్టర్ లైఫ్ నే మార్చేసింది. ఇటీవలే ఆ సినిమా రిలీజ్ అయింది.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా డిజాస్టర్ అయింది. దీంతో అతడి కల కూడా చెదిరినట్లు అయింది. మరి నిజంగా ఆ డైరెక్టర్ సక్సెస్ లో ఉంటే సాధ్యమయ్యేదా? అంటే అంత సులభమైన పనేం కాదు. ఒకేసారి నలుగురు సీనియర్లను డీల్ చేయడం ఆషామాషీ కాదు. బలమైన కథతో పాటు, సమర్ధవంతమైన పనివంతుడైతేనా డీల్ చేయగలరు. మునుపటి కష్టం కంటే నాలుగింతలు ఎక్కువ కష్టపడితే సాద్యమవుతుందేమో. కానీ అదే ఛాన్స్ మరో పేరున్న డైరెక్టర్ తీసుకుంటే గనుక నల్లేరు మీద నడకలా ఆ పని పూర్తి చేసేస్తాడు అన్నది కాదనలేని నిజం.
ఇప్పటికే ముగ్గురు సీనియర్లను డైరెక్ట్ చేసిన అనుభవం ఉంది. మరో సీనియర్ ని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. 100 కోట్ల వసూళ్లు కూడా ఆ డైరెక్టర్ తోనే సాధ్యమని అభిమానులంతా నమ్ముతోన్న తరుణం ఇదే. ఇదంతా పక్కన బెడితే ముగ్గురి ఇమేజ్ కి తగ్గ స్టోరీని సిద్దం చేయగల సమర్ధుడు అతడు. వాళ్లను అంతే తెలివిగా కన్విన్స్ చేయగలడు. తనకు తగ్గట్టు మౌల్డ్ చేసుకోగల నేర్పరి. ఏ హీరోని ఎలా ప్రజెంట్ చేయాలి? ఎవరెలాంటి క్యారెక్టర్ కు సెట్ అవుతారు? అన్నది పర్పెక్ట్ గా జడ్జ్ చేయగలడు. ఇమేజ్ పరంగా చూస్తే ఎవరి ప్రత్యేకత వారికుంది.
వారి ఇమేజ్ ఆధారంగా పాత్రలను రాయాల్సి ఉంటుంది. ఆ రకంగా పక్కాగా పాత్రలను డిజైన్ చేయగల సమర్దుడే. నలుగురు హీరోల్ని డైరెక్ట్ చేయాలనే ఆలోచన మనసులో ఆ డైరెక్టర్ కి కూడా ఉండే ఉంటుంది. కాకపోతే ఇంత వరకూ ఎక్కడా ఓపెన్ అవ్వలేదు. భవిష్యత్ లో ఈ కాంబినేషన్ కి అయితే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం ఆ స్టార్ డైరెక్టర్ మరో రెండు వారాల్లో కొత్త స్క్రిప్ట్ పనుల్లో బిజీ కానున్నాడు.