• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నా రోల్ మోడ‌ల్ని డైరెక్ట్...

నా రోల్ మోడ‌ల్ని డైరెక్ట్ చేస్తున్నా

| 'నా ఐడల్‌కి దర్శకత్వం వహించడం .. “యాక్షన్” చెప్పడం ఊహించ‌లేక‌పోతున్నా. ఇదినాకెంతో సంతోషాన్ని ఇచ్చే సంద‌ర్భం.

By - Tupaki Desk
Update: 2023-10-18 08:18 GMT

కెప్టెన్ కూల్ ధోని అభిమాని కానిది ఎవ‌రు? కోట్ల‌లో అభిమానులు సంపాదించుకున్న గొప్ప క్రీడాకారుడు అత‌ను. రిటైర్మెంట్ త‌ర్వాత కూడా అదే రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంటోన్న ఏకైక క్రికెట‌ర్ ధోని. ముఖ్యంగా ఐపీఎల్ చెన్నై సూప‌ర్ కింగ్స్ కి ప్రాతినిధ్యం వ‌హించ‌డం ధోనికి బాగా క‌లిసొచ్చిన అంశంగా చెప్పాలి. ఆయ‌న ఫ్యాన్ ఫాలోయింగ్ మ‌రింత పెరిగింది అక్క‌డ నుంచి.

త‌మిళ నాడు నుంచి చాలా మంది ప్ర‌ముఖులు ధోని అభిమానులుగా ఉన్నారు. అలాగే సెల‌బ్రిటీలు కూడా చాలా మంది అభిమానిస్తారు. అందులో డైరెక్ట‌ర్..న‌య‌న‌తార భర్త విగ్నేష్ శివ‌న్ కూడా ఒక‌రు. ఈయ‌న కూడా చెవికోసేసుకునే అభిమాని. తాజాగా ధోనీతో ఉన్న ఓ ఫోటోని విగ్నేష్ శివ‌న్ ట్విట‌ర్లో షేర్ చేసాడు. అయితే ఇది యాదృశ్చికంగా జ‌రిగింది కాదు. ఆ అభిమాన క్రికెట‌ర్ ని డైరెక్ట్ చేసే అవ‌కాశం రావ‌డంతో..ఇద్ద‌రు క‌లిసి ఓ రియ‌ల్ ఎస్టేట్ యాడ్ కోసం ప‌నిచేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా విగ్నేష్ ఇలా రాసుకొచ్చాడు.

'నా ఐడల్‌కి దర్శకత్వం వహించడం .. “యాక్షన్” చెప్పడం ఊహించ‌లేక‌పోతున్నా. ఇదినాకెంతో సంతోషాన్ని ఇచ్చే సంద‌ర్భం. వివరణకు మించి నేను ఇష్టపడే స్టార్. నా రియ‌ల్ రోల్ మోడల్! కెప్టెన్ కూల్` అని ఆ చిత్రాన్ని పంచుకుంటూ విఘ్నేష్ రాశాడు. ఈ ఏడాది జూలైలో విఘ్నేష్ శివన్ టీ షర్ట్‌పై ధోనీ సంతకం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే.

అప్పుడే ధోని కి ఎంత అభిమానో చాలా మందికి తెలిసింది. ఇప్పుడు ఏకంగా ధోనినే డైరెక్ట్ చేస్తున్నాడు. ఇలాంటి అద్భుతాలు జ‌ర‌గాలంటే పెట్టి పుట్టాలి. ఇక విగ్నేష్ శివ‌న్ సినిమాల‌తోనూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు ద‌ర్శ‌క‌త్వం చేస్తూనే నిర్మాణం వైపు వేగంగా క‌దులుతున్నారు. మ‌రోవైపు భార్య న‌య‌న‌తార కోసం స‌మ‌యం కేటాయించాల్సి వ‌స్తోంది. వృత్తి..వ్య‌క్తిగ‌త విష‌యాలు అన్ని విగ్నేష్ ద‌గ్గ‌రుండి చూసుకోవాల్సి వ‌స్తోంది

Tags:    
  • Dhoni 
  • Chennaisuperkings 
  • Nayanthara 
  • Vigneshsivan 
  • Petti 

Similar News

నాగ‌చైత‌న్య `వృషకర్మ`కు ఆ ఇద్ద‌రూ పోటీనా?

2026-11-07 04:06 GMT

ఔత్సాహిక న‌టీమ‌ణుల‌కు ఈ న‌టి జ‌ర్నీ ప‌ర్ఫెక్ట్ కేస్ స్ట‌డీ

2026-11-07 04:04 GMT

ఓం రౌత్‌ని ప‌దే పదే టార్గెట్ చేస్తున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్

2026-11-07 04:03 GMT

థియేట‌ర్ల వ్యాపారంలో స్టార్ హీరో 600 కోట్లు పెట్టుబ‌డి!

2026-11-07 04:02 GMT

సిద్ శ్రీరామ్.. ఒకప్పటి డిమాండ్ ఇప్పుడు ఏదీ!

2026-11-07 04:01 GMT

కాజల్‌ ఉండగా.. సాయిపల్లవి కోసం ఆరాటమా?

2026-11-07 04:00 GMT

సీనియర్ ఎన్టీఆర్ వల్లే జీవితంలో ఆ కీలకమైన పని చేసిన మురళి మోహన్..!

2026-11-07 03:51 GMT

లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకోవడం టాలీవుడ్‌లో ఒక శాపమా..?

2026-11-07 02:43 GMT

స్టార్ హీరో షూటింగ్ కోసం క్రికెట్ మ్యాచ్‌లు ఆపేసార‌ట‌..అదెట్టా?

2026-11-07 02:42 GMT

చిరు, నాగ్ స్టెప్పులు.. నాగచైతన్య లైఫ్ పై సీరియస్.. MegaVerse లో ఏం జరిగిందంటే..!

2026-11-07 02:41 GMT

లిప్ సింకుకి త‌గ్గ‌ట్టు డ‌బ్బింగ్ మాట‌లు రాయ‌డం ఎలా?

2026-11-07 02:30 GMT

రణ్‌బీర్ వల్ల కన్నీళ్లు పెట్టుకున్న ఆలియా భట్ నాన్న.. ఎందుకంటే?

2026-11-07 02:11 GMT

Copyright @2026

Powered by Blink CMS