అసలు హీరోయిన్ల తప్పేంటి? డింపుల్ రెస్పాన్స్ ఇలా!
ఒక సినిమా సక్సెస్ కావాలంటే ఇలాంటి పాత్రలే అవసరమని, ఇలాంటివే ఉండాలని భావించే డైరక్టర్లు, రైటర్లు, నిర్మాతలు సహా మొత్తం సిస్టమ్ ను ప్రశ్నించాలని డింపుల్ హయాతి సూచించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రీసెంట్ మూవీ పెద్ది విడుదలైన తర్వాత సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ రోల్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మూవీలో ఆమె రోల్ కు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వలేదని, కేవలం గ్లామర్ కే పరిమితం చేశారంటూ అనేక మంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఆ విషయంపై అనసూయ, ఆషిక రంగనాథ్ స్పందించగా.. తాజాగా నటి డింపుల్ హయాతి కూడా రెస్పాండ్ అయ్యారు.
సినిమాల్లో హీరోయిన్ల రోల్స్ లో విషయంలో వస్తున్న విమర్శలపై డింపుల్ హయాతి సోషల్ మీడియాలో తాజాగా స్పందిస్తూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం హీరోయిన్స్ రోల్స్ ను ఎలా డిజైన్ చేస్తున్నారనే అంశంపై చర్చ జరగడం సంతోషకరమని ఆమె అన్నారు. అయితే సినీ ప్రియులతోపాటు నెటిజన్లు హీరోయిన్లను మాత్రమే తప్పుబట్టడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు.
ఒక సినిమా సక్సెస్ కావాలంటే ఇలాంటి పాత్రలే అవసరమని, ఇలాంటివే ఉండాలని భావించే డైరక్టర్లు, రైటర్లు, నిర్మాతలు సహా మొత్తం సిస్టమ్ ను ప్రశ్నించాలని డింపుల్ హయాతి సూచించారు. హీరోయిన్లు తమకు వచ్చిన ఛాన్సుల పరిధిలోనే వర్క్ చేస్తారని, పెద్ద సినిమాల్లో నటిస్తూ మరింత మంది ప్రేక్షకులకు చేరువ కావాలని ట్రై చేస్తుంటారని డింపుల్ చెప్పారు.
ఒక రోల్ కు సరైన స్థాయి స్కోప్ లేకపోతే.. ఆ బాధ్యత పాత్రను పోషించిన హీరోయిన్ ది అస్సలు కాదని ఆమె క్లారిటీ ఇచ్చారు. అది కంప్లీట్ గా రైటింగ్, సినిమా ప్రొడక్షన్, మేకింగ్ కు సంబంధించిన నిర్ణయమని వివరించారు. అయితే ప్రేక్షకుల ముందు కనిపించేది క్యాస్టింగ్ కావడంతో విమర్శలన్నీ వారిపైనే పడుతున్నాయని చెప్పిన డింపుల్.. ఇండస్ట్రీలో హీరోయిన్లు తరచూ ఒకే తరహా పాత్రల్లో కనిపించడం వల్ల వారికి ఆడియన్స్ లో స్పెషల్ ఇమేజ్ ఏర్పడుతుందని అన్నారు.
దీంతో తమ యాక్టింగ్ స్టామినాను చూపించే అవకాశాలు ఇప్పుడు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు హీరో ఓరియెంటెడ్ స్టోరీల్లో మాత్రం వారికి కావాల్సినంత ఇంపార్టెన్స్, ఫ్రీడమ్ దక్కుతుందని చెప్పారు. స్క్రీన్ పై కనిపించే పాత్రలనే ప్రేక్షకులు నిజమని నమ్ముతారని, కానీ ఒక సినిమా ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఎన్నో ఎలిమెంట్స్, మరెన్నో డెసిషన్స్ ఉంటాయని డింపుల్ గుర్తుచేశారు.
సినిమా నిర్మాణంలో ప్రతి విషయం ఒక్కరి చేతిలో ఉండదని, అయినప్పటికీ బెస్ట్ రోల్స్, స్టోరీలు, సినిమా అనుభవాలకు అందరూ అర్హులేనని ఆమె పేర్కొన్నారు. ఏదేమైనా ఇప్పుడు పెద్దిలో జాన్వీ కపూర్ రోల్ చుట్టూ జరుగుతున్న చర్చ వేళ డింపుల్ హయాతి చేసిన కామెంట్స్ మరోసారి హీరోయిన్ రోల్స్ ఇంపార్టెన్స్ పై అందరి ఫోకస్ పడేలా చేశాయి. సమస్య హీరోయిన్లలో కాదని, ఉమెన్ రోల్స్ ను డిజైన్ విధానంలో ఉందని. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ రోల్స్ క్యారక్టరైజేషన్ చర్చ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.