ద్వేషించేవాళ్లను లడ్డూతో కొట్టిన దిల్జీత్
'సర్ధార్జీ 2'లో పాకిస్తానీ నటి హనియా అమీర్ కు అవకాశం కల్పించడంతో నటుడు, గాయకుడు దిల్జీత్ వివాదంలోకి వచ్చాడు.;
'సర్ధార్జీ 2'లో పాకిస్తానీ నటి హనియా అమీర్ కు అవకాశం కల్పించడంతో నటుడు, గాయకుడు దిల్జీత్ వివాదంలోకి వచ్చాడు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి. దాయాది దేశం పాకిస్తాన్‌కి భారత్ సహాయ నిరాకరణ అంతకంతకు కఠినంగా మారుతోందే కానీ, ఎందులోను వెనక్కి తగ్గడం లేదు. పాకిస్తానీ నటికి అవకాశం కల్పించినందున 'సర్దార్జీ 2'ని ఇండియాలో రిలీజ్ చేయలేకపోయారు. దిల్జీత్ బృందానికి ఫెడరేషన్ నుంచి ఎలాంటి అండదండలు లభించలేదు. పహల్గామ్ దాడికి ముందు నుంచే షూటింగ్ జరుగుతోంది. చాలా ముందే కథానాయికగా పాకిస్తానీ హనియాను ఫైనల్ చేసారు. అయినా దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదు.
అంతేకాదు.. ఇదే వివాదం కారణంగా దిల్జీత్‌ని ప్రతిష్టాత్మక 'బార్డర్ -2' సినిమా నుంచి తొలగించారని కూడా కథనాలొచ్చాయి. కానీ అన్నిటికీ దిల్జీత్ తనదైన శైలిలో సమాధానమిస్తున్నాడు. వివాదాల నడుమ కూడా అతడు జోవియల్ గా ఉన్నాడు. ఎంతో యాక్టివ్ గా ఉంటూ అందరి మనసుల్ని గెలుచుకుంటున్నాడు. ఇప్పుడు బార్డర్ 2లో తన పాత్ర చిత్రీకరణను ముగించాక అందరికీ స్వీట్లు పంచాడు. సెట్లో వరుణ్ ధావన్, అహాన్ శెట్టి సహా పలువురికి స్వీట్లు తినిపిస్తూ, ఆప్యాయంగా హగ్గులు ఇస్తూ దిల్జీత్ బోలెడంత సందడి చేతున్న వీడియో వైరల్ అవుతోంది.
మొత్తానికి దిల్జీత్ తన షూటింగ్ పూర్తి చేసి సెట్ నుంచి నిష్కృమించాడు. ఇంతకీ ఈ చిత్రంలో అతడి పాత్ర ఏమిటి? అంటే దానికి సంబంధించిన వివరాలు కూడా తెలిసాయి. దిల్జీత్ 'పరమ వీర చక్ర' అవార్డు గ్రహీత నిర్మల్‌జిత్ సింగ్ సెఖోన్ పాత్రను పోషించారు. ఈ చిత్రంలో సన్నీడియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.