లైంగిక దాడి కేసులో నటికి ఊరట.. బాధితురాలికి అండగా నిందితుడి భార్య

అయితే ఈ కేసులో మొత్తం పదిమందిని నిందితులుగా చేర్చగా ఆరుగురిని దోషులుగా కోర్టు తేల్చింది.;

Update: 2025-12-15 11:34 GMT

గత ఎనిమిది సంవత్సరాల క్రితం మలయాళ సినీ ఇండస్ట్రీలో జరిగిన ఒక ఘటన యావత్ సినీ ప్రపంచాన్ని కుదిపేసింది. 2017 ఫిబ్రవరి 17న ఒక స్టార్ మలయాళ నటి.. తన కారులో త్రిసూర్ నుంచి కొచ్చి వెళుతుండగా.. కొచ్చి సమీపంలో నటి కారును.. ఒక కారు వెంబడించి మరీ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు కిందకు దిగి నటి కారు డ్రైవర్ తో వాగ్వాదానికి దిగి.. అతడిని బెదిరించి మరీ ఆమె కారులోనే సుమారుగా రెండు గంటల పాటు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఫోటోలు, వీడియోలు కూడా తీశారు. అనంతరం కారు దిగి పరారయ్యారు. దీంతో భయాందోళన గురైన నటి ఒక డైరెక్టర్ ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్పగా వారు పోలీసులకు సమాచారం అందించారు.

అయితే ఈ కేసులో ప్రముఖ నటుడు దిలీప్ హస్తం ఉందని.. ఈ దాడికి దిలీప్ ప్లాన్ చేశాడని ఆరోపణలు వినిపించాయి. దీంతో 2017 జూలై 10వ తేదీన దిలీప్ ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే మూడు నెలల పాటు జైలు జీవితం అనుభవించిన దిలీప్.. బెయిల్ మీద బయటకు వచ్చారు. కానీ 8 ఏళ్లకు పైగా సుదీర్ఘ విచారణ జరిగింది. అయితే ఈరోజు ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో జరిగిన విచారణ తర్వాత దిలీప్ తో పాటు మరో ముగ్గురిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.. ఈ నేరానికి దిలీప్ ప్లాన్ చేసినట్టు ఎక్కడా నిర్ధారణ కాలేదని చెబుతూ అతడిని నిర్దోషిగా ప్రకటించింది.

అయితే ఈ కేసులో మొత్తం పదిమందిని నిందితులుగా చేర్చగా ఆరుగురిని దోషులుగా కోర్టు తేల్చింది. ఇక దిలీప్ తో పాటు మరో ముగ్గురిని రిలీజ్ చేశారు.. అయితే ఈరోజు దిలీప్ కి క్లీన్ చిట్ ఇవ్వడం అలాగే ఆరుగురిని దోషులుగా చేర్చి.. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. అయితే కోర్టు తీర్పు వెలువడిన తర్వాత బాధిత నటి 8 ఏళ్ల 9 నెలల 23 రోజుల నరకయాతన తర్వాత ఇప్పుడు ఉపశమనం కలిగినట్టు ఉంది అంటూ పోస్ట్ చేసింది. అయితే దీనిపై నిర్దోషిగా బయటకు వచ్చిన దిలీప్ మాజీ భార్య స్పందిస్తూ బాధితురాలికి అండగా నిలిచింది.. ఆమె తన పోస్ట్ ద్వారా నాకు న్యాయస్థానంపై నమ్మకం ఉంది. కానీ ఈ కేసులో బాధితురాలికి మాత్రం పూర్తి న్యాయం లభించిందని నాకనిపించడం లేదు. నేరం చేసిన వారికి శిక్ష పడింది. కానీ ఈ దారుణానికి ప్లాన్ చేసిన వ్యక్తులు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారు.

అది చాలా భయంకరమైనది. ముఖ్యంగా ఈ నేరం వెనుక ఉన్న వ్యక్తులకు కూడా శిక్ష పడినప్పుడే పూర్తి న్యాయం దక్కినట్లు అంటూ దిలీప్ మాజీ భార్య మంజు వారియర్ తెలిపారు . ఇక ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో పలు అనుమానాలకు దారితీస్తోంది. ముఖ్యంగా దిలీప్ మాజీ భార్య తన మాజీ భర్త దిలీపే ఈ దుర్ఘటనకు ప్లాన్ చేశారు అని చెప్పడం.. మరొకవైపు దీనికి గల సరైన ఆధారాలు లేవని కోర్టు చెప్పడంతో అందరిలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

Tags:    

Similar News