అవి తగ్గాల్సిన టైమ్ వచ్చింది!
ప్రేక్షకులు ఈ రోజు థియేటర్లకు రావడం లేదంటే ఆ తప్పు మాది అన్నారు దిల్ రాజు.;
ప్రేక్షకులు ఈ రోజు థియేటర్లకు రావడం లేదంటే ఆ తప్పు మాది అన్నారు దిల్ రాజు. ఆ రోజున్న పరిస్థితులకు అనుగునంగా సేఫ్‌గా గేమ్ ఆడాలని అన్ని రెమ్యునరేషన్‌లు, ప్రొడక్షన్ కాస్ట్‌లు పెంచేసుకుంటూ పోయామో అవన్నీ తగ్గాల్సిన టైమ్ ఇప్పుడోచ్చింది` అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దిల్ రాజు. ఆయన నిర్మించిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా `తమ్ముడు`. నితిన్ కెరీర్‌లోనే రూ.70 కోట్ల బడ్జెట్‌తో చేసిన ఈ మూవీని జూలై 4న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇస్తూ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఆయన మరిన్ని ఆసక్తికర విషయాల్ని ఈ సందర్భంగా వెల్లడించారు. మేము పెంచిన రెమ్యునరేషన్‌లు, బడ్జెట్‌లు తగ్గించుకుంటూ ప్రేక్షకులని థియేటర్లకు తీసుకొచ్చి ఫుట్ ఫాల్ పెంచాల్సిన సమయం వచ్చిందన్నారు. అందరూ ఆ దిశగా ఆలోచించుకుని అడుగులు వేస్తూ రీ కన్స్‌ట్రక్ట్ చేసుకోవాలి. బిఫోర్ కోవిడ్ ఇండస్ట్రీ ఎలా ఉంది? 2020 మార్చికి ముందు సంక్రాంతికి `అల వైకుంఠపురములో`, `సరిలేరు నీకెవ్వరు` బ్లాక్ బస్టర్ హిట్స్. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. `అల వైకుంఠపురములో` సినిమాకు థియేటర్లు 50 రోజులు ఫుల్ అయ్యాయి. ఇప్పుడు పెద్ద సినిమాలకు కూడా ఇలాంటి పరిస్థితులు కనిపించడం లేదు.
మళ్లీ ఆనాటి పరిస్థితుల్ని తిరిగి తీసుకురావడానికి అంతా కృషి చేయాల్సిన అవసరం ఏర్పడింది. హిందీలో లాగా ఎనిమిది వారాలకు ఓటీటీలకు సినిమాలని ఇస్తామా?.. లేక నాలుగు వారాల తరువాతే ఇస్తామా? అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. ఇండస్ట్రీ మొత్తంలో మార్పులకు శ్రీకారం చుట్టాల్సిన సమయమిది. ఆమీర్‌ఖాన్ ఓటీటీలకు వన్ ఇయర్ తరువాతే సినిమాలిస్తామని అంటున్నాడు. అది చాలా మంచి విషయం. లేదంటే నేను యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తానంటున్నాడు. ఈ స్టేట్‌మెంట్‌తో ఆయనో స్టెప్ తీసుకున్నాడు.అందరిలో ఆలోచన మొదలవ్వాలనే ఆయన అలాంటి స్టెప్ తీసుకున్నాడు.
ఆయన చెప్పినట్టు ఓటీటీల నుంచి పెద్ద సినిమాలకు వచ్చే 50 కోట్లు వదలుకుంటే థియేట్రికల్‌గా రూ.100 కోట్లు పెరిగే అవకాశం ఉంది. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్లు కూడా మళ్లీ థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే విధంగా మనం టికెట్ రేట్లు తగ్గించాలి. ప్రస్తుత విధానం వల్ల లోయర్ మిడిల్ క్లాస్ వాళ్లు సినిమాలకు మొత్తానికే రావడం మానేశారు. ఇక మిడిల్ క్లాస్ వాళ్లు 80 శాతం అసలు సినిమాలకే రావడం లేదు. ఇండస్ట్రీని ఇన్నేళ్లు పెంచి పోషించిన ఆడియన్స్‌ని మనమే చంపుతూ వస్తున్నాం. అందుకే ఈ పద్దతికి ముగింపు పలకాలని నా `తమ్ముడు` సినిమా నుంచే మొదలు పెట్టాను. ఫేక్ వ్యూస్ వద్దన్నాను. టికెట్ రేట్లు పెంచడం లేదు. ఇలా ప్రతి ఒక్కరూ చేస్తే ఆడియన్స్ మళ్లీ థియేటర్ల బాట పడతారు` అని చెప్పుకొచ్చారు దిల్ రాజు.