• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దిల్ రాజు సంక్రాంతి...

దిల్ రాజు సంక్రాంతి 'గేమ్' మారింది

| సంక్రాంతి పండుగ హడావుడిలో తెలుగు బాక్సాఫీస్ గేమ్ కొత్త మలుపులు తీసుకుంటోంది. అయితే ఈ గేమ్ లో దిల్ రాజు ఒక్కరే మూడు ఆటలు అడుతుండడం విశేషం

By - Tupaki Desk
Update: 2025-01-17 03:00 GMT

సంక్రాంతి పండుగ హడావుడిలో తెలుగు బాక్సాఫీస్ గేమ్ కొత్త మలుపులు తీసుకుంటోంది. అయితే ఈ గేమ్ లో దిల్ రాజు ఒక్కరే మూడు ఆటలు అడుతుండడం విశేషం. రెండు సినిమాలు సొంత ప్రొడక్షన్ లో రాగా మరో సంస్థలో నచ్చిన డాకు మహరాజ్ నైజాం రైట్స్ కూడా తనే తీసుకొని స్ట్రాటజీతో రిలీజ్ చేశారు. ఎవరితో ఎలాంటి గోడవ లేకుండా తనకు తానే పోటీగా నిలబడ్డారు. ఈ ఆటలో రాజుగారు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన టైమొచ్చింది.

పెద్ద బడ్జెట్‌తో, భారీ అంచనాల మధ్య విడుదలైన రామ్ చరణ్ గేమ్ చేంజర్ మొదట ఆధిపత్యం చూపించినప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. సంక్రాంతి రేసులో బాలకృష్ణ డాకు మహారాజ్ మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోగా, వెంకటేష్ “సంక్రాంతికి వస్తున్నాం” సూపర్ పాజిటివ్ టాక్‌తో ముందుకు దూసుకెళ్తోంది. అయితే గేమ్ చేంజర్ కి భారీ థియేటర్ల కలెక్షన్లు సాధించడంలో స్లోగా మొదలైంది.

మొదటి రోజుల్లో మంచి ఆక్యుపెన్సీ ఉన్నా, మౌత్ టాక్ ప్రభావంతో స్క్రీన్లలో జనాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మరోవైపు, రెండు రోజుల గ్యాప్‌లో రిలీజ్ అయిన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద నిలబడుతూనే ఉంది. “సంక్రాంతికి వస్తున్నాం”కి డిమాండ్ అమాంతం పెరగడంతో వెంకటేష్ సినిమాకు ప్రేక్షకులు వెనకడుగు వేయడం లేదు.

ఇటీవల విడుదలైన “సంక్రాంతికి వస్తున్నాం” విడుదలైన ప్రతీ ఏరియాలో అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది. మొదటి రెండు రోజుల్లో టికెట్లు దొరకక ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు. అలాగే స్క్రీన్ల పరంగా మరింత అన్యాయం జరిగినట్లు అనిపిస్తోంది. ఈ చిత్రం ఓవర్ ఫ్లో ఆడియెన్స్‌ను ఆకర్షించగా, “గేమ్ చేంజర్” స్క్రీన్లు ఎక్కువగా ఖాళీగా కనిపించాయి.

దిల్ రాజు నిర్మించిన ఈ రెండు చిత్రాల విషయంలో తగిన సమతుల్యత కల్పించడానికి ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. “గేమ్ చేంజర్” స్క్రీన్ల సంఖ్య తగ్గించి, వీకెండ్‌లో “సంక్రాంతికి వస్తున్నాం”కి ఎక్కువ స్క్రీన్లు కేటాయించనున్నారు. ఈ నిర్ణయం వ్యాపార దృక్పథంతో తీసుకున్నప్పటికీ, రామ్ చరణ్ అభిమానులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంక్రాంతి వీకెండ్‌లో “సంక్రాంతికి వస్తున్నాం” భారీ వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ను షేక్ చేయనుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇక “గేమ్ చేంజర్” పరిమిత స్క్రీన్లలో తన ప్రదర్శనను కొనసాగిస్తే చాలని దిల్ రాజు భావిస్తున్నారు అని ప్రచారం నడుస్తుంది . వెంకటేష్ చిత్రానికి వచ్చే ఆదాయం దృష్ట్యా ఈ నిర్ణయం సరైనదని ఆయన జడ్జ్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, “సంక్రాంతికి వస్తున్నాం” ఆడియెన్స్ హృదయాలను గెలుచుకుంటూ, సంక్రాంతి సీజన్ విజేతగా నిలవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రెండో వీకెండ్ కలెక్షన్ల ద్వారా ఈ సీజన్ విజేత ఎవరో తేలిపోతుంది.

Tags:    
  • Dilraju 
  • Sankranthikivasthunnam 
  • Gamechangermovie 
  • Ramcharan 
  • Shankar 
  • Tollywood 
  • Venkatesh 
  • Anilravipudi 
  • Producerdilraju 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS