ఇండస్ట్రీ వైఫల్యానికి రాజుగారు ఐదు కారణాలు!
ఆడియన్స థియేటర్ కు రావడానికి మనం ఏం కంటెంట్ ఇస్తున్నాం? ఏం తీస్తున్నాం? అన్నది ఎవరూ ఆలోచించడం లేద.;
చిత్ర పరిశ్రమ అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉందంటూ నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆరు నెలల్లో విజయం సాధించినవి కేవలం 6 సినిమాలే అన్నారు. ఈ పరిస్థితిని అర్దం చేసుకుని మార్చాల్సిన బాద్యత అందరిపై ఉన్నా ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన చెందారు. `కోవిడ్ మొదలైన తర్వాత జనాలను ఓటీటీకి అలవాటు చేసింది మేమే.
మా స్వలాభం కోసం ఆనాడు కంటెంట్ ఓటీటీకి అమ్మేసాం. ప్రేక్షకులు థియేటర్ వరకూ రావాల్సిన పని లేదు అందరూ ఇంట్లో కూర్చుని చూడండని మేమే అలవాటు చేసాం. ఆ తర్వాత 2020 లో సంక్రాంతికి `అల వైకుంఠపురంలో, `సరిలేరు నీకెవ్వరు` రిలీజ్ అయి మంచి వసూళ్లు సాధించాయి. ఆ సంవత్సరం చూసిన రెవన్యూ మళ్లీ ఇప్పటి వరకూ ఏ సంక్రాంతికి చూడలేదు. అంటే పుట్ పాల్ తగ్గుతూ వస్తోంది.
నాకు తెలిసి అప్పటికి ఇప్పటీకి 50 శాతం పుట్ పాల్ తగ్గిపోయింది. ప్రేక్షకులు థియేటర్ కి రావడం లేదు. టికెట్ రేట్లు, క్యాంటిన్ రెట్లు పెంచేసాం. వాటిని చూసి ప్రేక్షకుడు థియేటర్ రావాలంటే భయపడు తున్నారు. కొన్ని థియేటర్లు సరిగ్గా లేవు. రెన్నోవేట్ చేయాలి. కానీ థియేటర్ మీద పెట్టుబడి పెట్టిన తర్వాత వస్తోదా రాదో తెలియదు. దీంతో రెన్నోవేషన్ చేయడం లేదు.
ఆడియన్స థియేటర్ కు రావడానికి మనం ఏం కంటెంట్ ఇస్తున్నాం? ఏం తీస్తున్నాం? అన్నది ఎవరూ ఆలోచించడం లేదు. కోవిడ్ తర్వాత కొందరు హీరోలుగానీ, దర్శకులు గానీ ఎక్కువ సినిమాలు తీసామా? ఓటీటీ కి ఎలా అమ్మాం అన్నదే ఆలోచిస్తున్నారు. నాన్ థియేట్రికల్ రెవెన్యూ ఎంత వచ్చిందని లెక్కలేస్తున్నారు. కానీ ప్రేక్షకుడిని దూరం చేసుకుంటామని ఎవరూ ఆలోచించలేదు.
ప్రతీ ప్రొడక్షన్ హౌస్ ఐదారు సినిమాలు తీయడానికి చూస్తోంది. అలాంటప్పుడు సినిమా క్వాలిటీ పడిపోతుంది. వాటిలో ప్రేక్షకుడిని థియేటర్ కు తీసుకొచ్చే కంటెంట్ ఉండటం లేదు. ఈ ఆరు నెలల కాలంలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి? ఎన్ని విజయం సాధించాయి? సరైన రిలీజ్ లు లేక ఐదారు వారాల పాటు థియేటర్లు మూసుకునే పరిస్థితి ఏర్పడింది. వారం వారం సరైన కంటెంట్ ఇవ్వలేక పోతున్నాం. ఆడియన్ కి ఎగ్జైట్ మెంట్ లేకుండా చేసేసాం. ఈ పరిస్థితిని ఎవరూ అర్దం చేసుకోవడం లేదు. ఇలాగే కొనసాగితే సినిమా ఇండస్ట్రీ పరిలస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు.