• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సందీప్ రెడ్డిని ఆ హీరోలు...

సందీప్ రెడ్డిని ఆ హీరోలు మోసం చేశారా?

| 'అర్జున్ రెడ్డి' తర్వాత సందీప్ రెడ్డి వంగాకు టాలీవుడ్‌లో ఎన్నో అవకాశాలు లభించాయి.

By - Tupaki Desk
Update: 2024-11-06 08:45 GMT

కేవలం ఒకటి రెండు సినిమాలు మాత్రమే తెరకెక్కించినా నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ అవడం అసలు సాధ్యం అయ్యే పని కాదు. కానీ, దీన్ని కొందరు సుసాధ్యం చేసి చూపించారు. అలాంటి వారిలో తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఒకడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో డైరెక్టర్‌గా జర్నీని మొదలు పెట్టిన అతడు.. ఆ తర్వాత అదే చిత్రం రీమేక్‌తో బాలీవుడ్‌లోకి సైతం వెళ్లి అక్కడి బాక్సాఫీస్‌ను ఓ రేంజ్‌లో షేక్ చేసేశాడు.

‘అర్జున్ రెడ్డి’ తర్వాత సందీప్ రెడ్డి వంగాకు టాలీవుడ్‌లో ఎన్నో అవకాశాలు లభించాయి. కానీ, ఇక్కడ ప్రాజెక్టులను పట్టాలెక్కించకుండా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ మూవీ చేశాడు. ఇది ఏ మేర హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి నుంచి అతడి స్థాయి మరింతగా పెరిగింది. ఈ ఊపులోనే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్‌తో ‘స్పిరిట్’ అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.

వరుసగా హై ఓల్టేజ్ స్టోరీలతో పాన్ ఇండియా చిత్రాలనే చేస్తూ దేశంలోనే గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకుంటోన్న సందీప్ రెడ్డి వంగా గురించి తాజాగా టాలీవుడ్ ఫేమస్ రైటర్ కోన వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే అతడిని ఇద్దరు హీరోలు దారుణంగా మోసం చేశారని చెప్పారు. దీంతో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండియా వ్యాప్తంగా సెన్సేషన్ అవుతున్నాయి.

తాజా ఇంటర్వ్యూలో కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి కథను పట్టుకుని ఓ హీరో ఆఫీస్‌లో మూడు సంవత్సరాల పాటు తిరిగాడు. అతడికి కథ నచ్చడంతో తన ఆఫీస్‌లోనే స్టోరీపై వర్క్ చేయమని చెప్పాడు. దీంతో సందీప్ రెడ్డి ఓ మూలన కూర్చుని వర్క్ చేసుకున్నాడు. ఆ సమయంలో ఆ హీరో టీమ్ అతడికి ఓ పూట భోజనం మాత్రమే పెట్టింది. అలా మూడేళ్లు గడిచిన తర్వాత ఈ సినిమా చేయలేనని ఆ హీరో హ్యాండిచ్చాడు’ అంటూ చెప్పుకొచ్చారు.

కోన వెంకట్ కంటిన్యూ చేస్తూ.. ‘మొదటి హీరో మూడేళ్లు తప్పించుకున్న తర్వాత సందీప్ రెడ్డి వంగా మరో హీరో దగ్గరకు వెళ్లాడు. ఆయన కూడా రెండేళ్ల పాటు సినిమా చేస్తానని చెప్పి చేయలేదు. దీంతో సందీప్ రెడ్డి అన్నయ్యే అతడి బాధను చూసి ‘అర్జున్ రెడ్డి’ సినిమాను నిర్మించారు. అలా ఈ దర్శకుడు తెరపైకి వచ్చాడు’ అని వెల్లడించారు.

మొత్తానికి కోన వెంకట్ ఈ వ్యాఖ్యలు చేయడంతో సందీప్ రెడ్డి వంగాను మోసం చేసిన హీరోలు ఎవరా అని అందరూ చర్చించుకుంటున్నారు. అదే సమయంలో అతడికి జరిగిన అవమానాలే ఇప్పుడు ఇంత గొప్ప దర్శకుడిని చేశాయి అని చెప్పుకుంటున్నారు.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Filmindustry 
  • Arjunreddy 
  • Animal 
  • Spirit 
  • Sandeepreddyvanga 
  • KonaVenkat 

Similar News

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

Copyright @2026

Powered by Blink CMS