• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బన్నీ మొదలుపెట్టేశాడు!

బన్నీ మొదలుపెట్టేశాడు!

| మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బన్నీ మాత్రం సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయారనే చెప్పాలి.

By - Tupaki Desk
Update: 2024-12-28 13:31 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రీసెంట్ గా పుష్ప-2 మూవీతో ఎలాంటి హిట్ అందుకున్నారో అందరికీ తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ కాసుల వర్షం కురిపిస్తోంది. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బన్నీ మాత్రం సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయారనే చెప్పాలి.

పోస్ట్ ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్.. ఢిల్లీ వెళ్లి ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రోజే పుష్ప-2 ప్రీమియర్స్ సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అనంతరం బెయిల్ పై బయటకు రావడం, తదనంతర పరిణామాల వల్ల బన్నీ ఇబ్బందిపడ్డారు!

దీంతో ముందుగా ప్లాన్ చేసినట్లు.. అల్లు అర్జున్ ప్రమోషన్స్, సక్సెస్ మీట్స్, ఈవెంట్స్ లో పాల్గొనలేకపోయారు. అయితే తాజాగా పుష్ప-2 సినిమా పనుల కోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ కు బన్నీ వెళ్లినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా థియేట్రికల్ వెర్షన్ కు కొన్ని సీన్స్ ను మేకర్స్ యాడ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

సినిమా అవుట్ పుట్ నిడివి ఎక్కువ కావడంతో రిలీజ్ కు ముందుకు కొన్ని సీన్స్ ను కట్ చేశారు మేకర్స్! దీంతో మూవీలో కొన్నిచోట్ల కంటిన్యుటీ మిస్ అయిందనే వార్తలు వచ్చాయి. అది వాస్తవమేనని చెప్పాలి. సినిమాలో జపాన్ కు వెళ్లిన పుష్ప రాజ్ ఇంట్రో ఫైట్ సడెన్ గా ఆగిపోతుంది. దీంతో ఆడియన్స్ మదిలో అనేక ప్రశ్నలు మెదిలాయి.

వాటిన్నింటికీ ఆన్సర్ ఇచ్చే సీన్స్ ఇప్పటికే మేకర్స్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వాటిని సినిమాలో కలపడానికి మేకర్స్ సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది. ఆ సీన్స్ కోసం ఇప్పుడు బన్నీ డబ్బింగ్ చెబుతున్నారని సమాచారం. అందుకే అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్లినట్లు వినికిడి. దీంతో అన్ని భాషల్లో అల్లు అర్జున్ డబ్బింగ్ ను కంప్లీట్ చేస్తున్నారట.

పని అయ్యాక.. జనవరి 1వ తేదీ నుంచి కొత్త వెర్షన్ అందుబాటులోకి రానుందని సమాచారం. ఓటీటీ వెర్షన్ లో కూడా కొత్త సీన్స్ ఉంటాయని టాక్. దీంతో ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే సమయంలో కొత్త వెర్షన్ వచ్చాక.. మళ్లీ ఆడియన్స్ థియేటర్లకు వెళ్లే అవకాశం ఉంది. వసూళ్లు కూడా పెరుగుతాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Filmindustry 
  • Pushpa2 
  • Alluarjun 
  • Dubbing 
  • Hyderabad 
  • Annapurnastudios 
  • Ottversions 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS