ప‌హ‌ల్గావ్ ఘ‌ట‌న దియామీర్జాపై ట్రోల్స్‌

క‌శ్మీర్‌లోని పెహెల్గావ్‌లో జ‌రిగిన హృద‌య‌విదార‌క సంఘ‌ట‌న‌ని యావ‌త్ ప్ర‌పంచం ముక్తకంఠంతో ఖండించింది.;

Update: 2025-04-24 14:43 GMT

క‌శ్మీర్‌లోని పెహెల్గావ్‌లో జ‌రిగిన హృద‌య‌విదార‌క సంఘ‌ట‌న‌ని యావ‌త్ ప్ర‌పంచం ముక్తకంఠంతో ఖండించింది. అమెరికా సైతం త‌మ పూర్తి మ‌ద్ద‌తు భార‌త్‌కేన‌ని తేల్చి చెప్పింది. దాయాది దేశ‌మైన బాంగ్లాదేశ్ కూడా ఈ దాడుల‌పై స్పందించి భార‌త్‌కు మ‌ద్ద‌తుగా నిలిచి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ప‌ర్య‌టాకుల‌పై దాడి నేప‌థ్యంలో భార‌త్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకోవ‌డం తెలిసిందుఏ. 48 గంట‌ల్లో పాకిస్థాన్ పౌరులు భార‌త్ వీడాల‌ని, భార‌త పౌరులు పాక్ వీడి ఇండియాకు రావాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

ఇండియా- పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు ప‌తాక స్థాయికి చేరిన వేళ పాక్ న‌టీన‌టులు భార‌తీయ సినిమాల్లో న‌టించ‌డానికి వీళ్లేద‌ని నెట్టింట పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికే వాణీ క‌పూర్ న‌టించిన సినిమాపై నిషేధాన్ని విధించ‌డం తెలిసిందే. ఈ మూవీలో న‌టించిన పాకిస్థానీ న‌టుడు ఫ‌వాద్‌ఖాన్‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డంపై బాలీవుడ్ న‌టి దియా మీర్జాపై నెట్టింట విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమ‌ర్శ‌ల‌పై న‌టి దియా మీర్జా స్పందించారు. అవి గ‌తంలో చేసిన వ్యాఖ్య‌ల‌ని ఆమె వివ‌ర‌ణ ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా దియా ఓ పోస్ట్ పెట్టారు. `ఏప్రిల్ 10న ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో నేను ఫ‌వాద్ గురించి మాట్లాడా. ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడికి కొద్ది రోజుల ముందు నేను చేసిన వ్యాఖ్య‌ల‌ను తాజాగా చేసిన‌ట్టుగా చూపించ‌కండి. ఈ అస‌త్య ప్ర‌చారం ఆపండి` `ని మీడియాకు ఆమె విజ్ఞ‌ప్తి చేశారు. దియా మీర్జా పెట్టిన‌పోస్ట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. పాకిస్థానీ న‌టుడు ఫ‌వాద్ ఖాన్ వాణీక‌పూర్ హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ మూవీ `అబీర్ గులాల్‌`లో హీరోగా న‌టించాడు. ఈ నేప‌థ్యంలో క‌ళ‌కు ఎలాంటి బేధాలుండ‌వంటూ దియా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వివాదాస్ప‌దం అవుతున్నాయి. దీనిపైనే ఆమె తాజాగా వివ‌ర‌ణ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News