స్పై యూనివర్స్ పరిస్థితేంటీ?
ఎలాంటి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొని అక్కడి గ్యాంగస్టర్లని అంతం చేశాడు.. ఐఎస్ ఐ ఆట ఎలా కట్టించాడనే కథతో `ధురంధర్`ని రూపొందించారు.;
ఇండియా వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారిన మూవీ `ధురంధర్`. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించగా ఆదిత్యధర్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ కొనసాగుతోంది. ఎవరూ ఊహించని విధంగా రికార్డుల్ని తిరగరాస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్ 5న విడుదలైన `ధురంధర్` ఇప్పటి వరకు రూ.800 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి సంచనం సృష్టిస్తోంది.
బాలీవుడ్ క్రిటిక్స్, యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్స్ కొంత మంది ఇదొక ప్రాపగండ ఫిల్మ్ అంటూ ప్రచారం చేస్తున్న ఈ మూవీని మాత్రం పాక్ ప్రేక్షకులు రికార్డు స్థాయిలో ఆదరిస్తూ ఎంజాయ్ చేస్తుండటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పాక్‌లోని దుష్టశక్తుల్ని అంతం చేయడం కోసం చేపట్టిన ఆపరేషన్ `ధురంధర్`లో భాగంగా ఎంట్రీ ఇచ్చిన ఓ స్పై అక్కడ ఏం చేశాడు. ఎలాంటి జీవితాన్ని అనుభవించాడు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొని అక్కడి గ్యాంగస్టర్లని అంతం చేశాడు.. ఐఎస్ ఐ ఆట ఎలా కట్టించాడనే కథతో `ధురంధర్`ని రూపొందించారు.
ఇదే పాక్ సినీ ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటోందట. పాక్‌తో పాటు పలు అరబిక్ కంట్రీస్‌లో బ్యాన్‌కు గురైన ఈ మూవీని పాక్‌లో రికార్డ్ స్థాయిలో వీక్షిస్తున్నారు. పైరసీ ప్రింట్‌ని రికార్డు స్థాయిలో డౌలోడ్ చేసుకుని వీక్షిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. స్పై యాక్షన్ మూవీస్ అంటే యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ గుర్తొస్తుంటుంది. ఈ యూనివర్స్‌లో ఇప్పటి వరకు ఏక్ థా టైగర్, టైగర్ జిందాహై, వార్, పఠాన్, టైగర్ 3, వార్ 2 వంటి సినిమాలొచ్చాయి.
దీనిలోని కొన్ని స్పై మూవీస్‌లలో ఇండియన్ రా ఏజెంట్‌లు, రాని వీడిన వాళ్లే ప్రధానంగా విలన్స్. ఇక ఏక్ థా టైగర్, టైగర్ జిందాహై, పఠాన్, టైగర్ 3 వంటి స్పై మూవీస్‌లలో పాక్ ఐఎస్ ఐ ఏజెంట్‌లే హీరోయిన్‌లు. ఇక ఇదే యూనివర్స్‌లో `ఆల్ఫా` పేరుతో మరో స్పై మూవీ రాబోతోంది. ఇదిలా ఉంటే తాజాగా విడుదలై సంచలనం సృష్టిస్తున్న `ధురంధర్` యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ కు బ్రేకులు వేసేలా ఉందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటి వరకు యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో చేసిన సినిమాలు ప్లాన్డ్ మూవీస్, ఓ ఫిక్షనల్ స్టోరీస్.
వారికి కావాల్సి నట్టుగా కథలని, పాత్రలని, స్టోరీలని మార్చి జనంపై రుద్దే ప్రయత్నం చేస్తూ కోట్లు కొల్లగొట్టింది. కానీ `ధురంధర్` తరువాత స్పై యాక్షన్ మూవీస్ విషయంలో అర్థం మారిపోయింది. రియలిస్టిక్ అంశాలతో చేసిన ఈ సినిమా ఊహల మాయ చేస్తున్న యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌ని డిస్ట్రాయ్ చేసిందని బాలీవుడ్‌లో ఓ వర్గం బలంగా వాదిస్తోంది. దీనికి రీసెంట్‌గా విడుదలై డిజాస్టర్ గా నిలిచిన `వార్ 2` బెస్ట్ ఎగ్జాంపుల్ అని అంటున్నారు. `ధురంధర్` తరువాత యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేనని కామెంట్‌లు చేస్తున్నారు.