• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దురంధర్ 2: అమెరికాలో...

దురంధర్ 2: అమెరికాలో హాలీవుడ్ సినిమాల‌ను మించేలా!

| ప్రస్తుత కాలంలో భారతీయ సినిమాలకు ఉత్తర అమెరికా వసూళ్లు అత్యంత కీలకంగా మారాయి.

By - Sivaji Kontham
Update: 2026-03-23 10:57 GMT

ప్రస్తుత కాలంలో భారతీయ సినిమాలకు ఉత్తర అమెరికా వసూళ్లు అత్యంత కీలకంగా మారాయి. గతంలో బాహుబలి 2, RRR, పుష్ప 2 వంటి చిత్రాలు అక్కడ సృష్టించిన ప్రభంజనం మన మార్కెట్ స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పింది. తాజాగా రణవీర్ సింగ్ నటించిన `దురంధర్: ద రివెంజ్` (దురంధర్ 2) అదే బాటలో పయనిస్తూ అద్భుతమైన ఓపెనింగ్స్‌ను సాధించింది. హాలీవుడ్ చిత్రాల పోటీని తట్టుకొని మరీ ఈ సినిమా ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద టాప్- 3లో నిలవడం భారతీయ సినీ పరిశ్రమ గర్వించదగ్గ విషయం.

ఈ వారాంతపు బాక్సాఫీస్ లెక్కలను పరిశీలిస్తే.. ర్యాన్ గోస్లింగ్ నటించిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ `ప్రాజెక్ట్ హెయిల్ మేరీ` 80.5 మిలియన్ డాల‌ర్ల‌తో మొదటి స్థానంలో నిలిచింది. డిస్నీ-పిక్సర్ `హాపర్స్` 18 మిలియన్ డాల‌ర్ల‌తో రెండో స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఈ రెండు భారీ హాలీవుడ్ చిత్రాల తర్వాత అందరినీ ఆశ్చర్యపరుస్తూ రణవీర్ సింగ్ `దురంధర్ 2` సుమారు 10 మిలియన్ డాల‌ర్ల‌ వసూళ్లతో మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. టాప్ 10 జాబితాలో మిగిలిన ఏడు హాలీవుడ్ సినిమాలు దురంధర్ కంటే వెనుకబడిపోవడం విశేషం.

ముఖ్యంగా హాలీవుడ్ పాపులర్ సీక్వెల్ `రెడీ ఆర్ నాట్ 2`ను కూడా దురంధర్2 అధిగమించడం గమనార్హం. `రెడీ ఆర్ నాట్ 2` సుమారు 9.1 మిలియన్ డాల‌ర్లు వసూలు చేయగా.. భారతీయ చిత్రమైన దురంధర్ 2 దానికంటే ఎక్కువ వసూళ్లను రాబట్టి స్థాయిని నిరూపించుకుంది. కేవలం హారర్ చిత్రాలే కాకుండా కొలీన్ హూవర్ నవల ఆధారంగా వచ్చిన `రిమైండర్స్ ఆఫ్ హిమ్` వంటి చిత్రాలు కూడా భారతీయ సినిమా జోరు ముందు నిలవలేకపోయాయి. ఇది ఉత్తర అమెరికాలో మన సినిమాలకు ఉన్న క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది.

దురంధర్ 2 వసూళ్ల ప్రయాణం గురువారం నుండే ఘనంగా మొదలైంది. ప్రీమియర్ షోల ద్వారా 3.94 మిలియన్ డాల‌ర్లు సాధించిన ఈ చిత్రం.. శుక్రవారం `ప్రాజెక్ట్ హెయిల్ మేరీ` విడుదలైనా కానీ.. 2.96 మిలియన్ డాల‌ర్ల‌తో నిలకడగా రాణించింది. శనివారం మళ్లీ పుంజుకుని 3.88 మిలియన్ డాల‌ర్లు వసూలు చేయడం సినిమాపై ఉన్న సానుకూలతకు నిదర్శనం. మొత్తంగా తొలి వారాంతంలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటి విదేశీ గడ్డపై ఇండియన్ సినిమా జెండాను ఎగురవేసింది.

అంతర్జాతీయ స్థాయిలో `ప్రాజెక్ట్ హెయిల్ మేరీ` వంటి భారీ బడ్జెట్ సినిమాలు ఐమాక్స్ స్క్రీన్లను ఆక్రమించినా కానీ.. దురంధర్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆదిత్య ధర్ దర్శకత్వ ప్రతిభ, రణవీర్ సింగ్ నటన ఈ సీక్వెల్‌కు ప్రధాన బలంగా నిలిచాయి. హాలీవుడ్ సినిమాలతో సమానంగా మన సినిమాలు కూడా టాప్ చార్టుల్లో నిలబడటం చూస్తుంటే భ‌విష్య‌త్‌లో భారతీయ సినిమా గ్లోబల్ మార్కెట్‌ను శాసించడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    
  • dhurandhar2 
  • northamericaboxoffice 
  • ranveersingh 
  • bollywoodglobal 
  • indianfilm 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS