నెట్టింట పునీత్ రాజ్‌కుమార్ కూతురి పోస్ట్ వైరల్..ఎందుకంటే
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కూతురు ధృతి రాజ్ కుమార్ తన తండ్రి కలను సొంతం చేసింది.;
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కూతురు ధృతి రాజ్ కుమార్ తన తండ్రి కలను సొంతం చేసింది. అవును ధృతి తన తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ, టాప్ మార్క్స్ తో అమెరికాలోని ఓ యూనివర్సిటీలో డిగ్రీలో పాసై యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకుంది. ఈ సందర్భంగా తన తల్లిని హగ్ చేసుకుని ఎమోషనలైంది ధృతి.
ధృతి తను డిగ్రీ పట్టా పొందిన ఫోటోలను, తన తల్లిని కౌగిలించుకుంటున్న వీడియోను తన ఇన్‌స్టా లో పోస్ట్ చేయగా, ఈ టైమ్ లో తండ్రి ఉంటే ఎంతో సంతోషించేవాడని ఆ వీడియోను చూసిన పునీత్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2021లో డిగ్రీ పూర్తి చేయడానికి అమెరికా వెళ్లిన ధృతి, పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి ధృతి రీసెంట్‌గానే గ్రాడుయ్యేషన్ పూర్తి చేసింది.
ధృతి గ్రాడ్యుయేషన్ డే లో తన తల్లి అశ్వినీ పునీత్ రాజ్‌కుమార్, వినయ్ రాజ్ కుమార్, వందిత పునీత్ రాజ్‌కుమార్ పాల్గొనగా ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. కన్నడ ఇండస్ట్రీలో పునీత్ రాజ్ కుమార్ ఎన్ని రికార్డులు సృష్టించాడనేది అందరికీ తెలిసిందే. అందరూ పునీత్ ను ముద్దుగా అప్పూ అని పిలుచుకుంటూ ఉంటారు.
2002లో పునీత్ అప్పు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి పెట్టడంతో ఆయన్ను అందరూ అప్పు అనే పిలుచుకుంటారు. మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న పునీత్ ఆ తర్వాత తన కెరీర్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. పునీత్ నుంచి ఆఖరిగా వచ్చిన సినిమా జేమ్స్. 2021లో ఆయన జిమ్ చేస్తున్న టైమ్ లో సడెన్ గా హార్ట్ ఎటాక్ వచ్చి మరణించారు.