ఘోర రోడ్డు ప్రమాదంలో ఢీ ఫేమ్ పండు మాస్టర్.. రెండు కాళ్లూ!

అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో.. అల్లరితో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు ఢీ డాన్సర్ పండు మాస్టర్.

Update: 2026-06-03 05:25 GMT

అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో.. అల్లరితో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు ఢీ డాన్సర్ పండు మాస్టర్. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలి అనే రేంజ్ లో తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో దూసుకుపోతున్న ఈయన జీవితంలో ఇప్పుడు ఒక్కసారిగా విషాదం అలుముకుంది. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పండు మాస్టర్ తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా ఆయన కాళ్లకు తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

అసలు విషయంలోకి వెళ్తే.. డాన్స్ మాస్టర్ పండు మంగళవారం తన బృందంతో కలిసి తగరపువలస సమీపంలో జరిగిన ఒక జాతర డాన్స్ ఈవెంట్ కి హాజరయ్యాడు. ఆ ఈవెంట్ ముగిసిన తర్వాత తన బృందంతో కలిసి కారులో తిరిగి హైదరాబాద్ వస్తున్నాడు. ఆనందపురం సమీపంలో కారులో ఉన్న ఒక డాన్సర్ కు అస్వస్థత కావడంతో వాంతులు అయ్యాయి. దాంతో రోడ్డు పక్కన కారును ఆపారు. అయితే అదే సమయంలో వెనుక నుంచి వేగంగా కోళ్లలోడుతో వచ్చిన బొలెరో వాహనం ఆగి ఉన్న పండు కారును ఢీకొట్టింది. కోళ్ల బొలెరో వేగంగా ఢీకొట్టడంతో కారు తీవ్రంగా దెబ్బతినగా.. కారు పక్కనే ఉన్న పండు మాస్టర్ కి తీవ్రంగా గాయాలయ్యాయి.

ఈ ప్రమాదంలో డాన్స్ మాస్టర్ పండు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన రెండు కాళ్లకు గాయాలవడంతో వెంటనే పండుని విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇకపోతే పండు మాస్టర్ తో పాటు ఈ కారులో ప్రయాణిస్తున్న మరి కొంతమంది డాన్సర్లు కూడా ఈ ప్రమాదంలో గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారికి ప్రస్తుతం వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని..ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో కోళ్ల లోడ్ బొలెరో అతివేగమే ఇందుకు ప్రమాదానికి కారణమా? లేక డ్రైవర్ నిర్లక్ష్యమా? ప్రమాదం జరగడం వెనుక అసలు కారణం ఏమిటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక పండు మాస్టర్ కి యాక్సిడెంట్ జరిగిందని తెలియడంతో పలువురు సినీ సెలబ్రిటీలు, బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు ప్రస్తుతం పండు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని ఆరా తీస్తున్నారు.

పండు విషయానికి వస్తే.. ఢీ షో తో పాటు పలు టీవీ కార్యక్రమాలలో కూడా పార్టిసిపేట్ చేసేవారు. ఆ షోల ద్వారా వచ్చిన క్రేజ్ కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి పేరు దక్కించుకోవడమే కాకుండా తన టీంతో కలిసి షోలు చేయడం కూడా ప్రారంభించారు. ఇక ఇప్పుడు ఆయనకు ఇలా ఆక్సిడెంట్ అయిందని తెలియడంతో అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Tags:    

Similar News