హాస్పిటల్ పాలైన సీనియర్ హీరో.. ఆ భయమే కారణమా?
అయితే హాస్పిటల్లో ఉన్న ధర్మేంద్రను చూడడానికి మరో బాలీవుడ్ నటుడు గోవిందా వెళ్లారట. అలా బ్రీచ్ కాండీ హాస్పిటల్లో ఉన్న ధర్మేంద్రను చూడడం కోసం గోవిందా సోమవారం సాయంత్రం అక్కడికి వెళ్లారు.;
బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర గత కొద్ది రోజుల నుండి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ.. హాస్పిటల్లో చేరిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలోనే కొంతమంది ఆయన చనిపోయినట్టు వార్తలు క్రియేట్ చేశారు. దాంతో చాలామంది ధర్మేంద్ర చనిపోయారని అనుకున్నారు. కానీ ఈ రూమర్లపై ధర్మేంద్ర కూతురు ఈషా, ఆయన భార్య హేమమాలిని ఫైర్ అవుతూ ఇలాంటి అవస్తవాలు ప్రచారం చేయకండి.ధర్మేంద్ర ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ ప్రచారాలు ఆగిపోయాయి.
పైగా ధర్మేంద్ర పూర్తిగా కోలుకొని హాస్పిటల్ నుండి ఇంటికి కూడా వెళ్లారు. అయితే హాస్పిటల్లో ఉన్న ధర్మేంద్రను చూడడానికి మరో బాలీవుడ్ నటుడు గోవిందా వెళ్లారట. అలా బ్రీచ్ కాండీ హాస్పిటల్లో ఉన్న ధర్మేంద్రను చూడడం కోసం గోవిందా సోమవారం సాయంత్రం అక్కడికి వెళ్లారు. ఆయన్ని చూసి మళ్లీ ఇంటికి వెళ్ళాక అర్ధరాత్రి 1:00 గంటల సమయానికి గోవింద తన నివాసంలో స్పృహ తప్పి ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారట.దాంతో వెంటనే గమనించిన ఇంట్లో వాళ్ళు గోవిందను జుహులోని క్రిటికేర్ హాస్పిటల్ కి తరలించారు.. దాంతో చాలామంది గోవింద అభిమానులు ఆయన త్వరగా కోలుకొని ఇంటికి రావాలని కోరుకుంటున్నారు.
అయితే హాస్పిటల్లో ఉన్న ధర్మేంద్రని గోవింద చూడ్డానికి వెళ్లినప్పుడు కూడా చాలా నీరసంగా.. ఏదో ఇబ్బంది పడుతున్నట్టు కనిపించారని, హాస్పిటల్ దగ్గరి నుండి ఆయన కారులో వెళ్తున్న వీడియోలు, ఫోటోలు చూసి కొంతమంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొంతమందేమో హాస్పిటల్లో ఉన్న ధర్మేంద్ర పరిస్థితి చూసి గోవింద భయపడ్డారని, అందుకే ఆ టెన్షన్లో ఆయన స్పృహ తప్పి పడిపోయారంటూ కామెంట్లు పెడుతున్నారు.మరి గోవిందకు ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నాయా.. లేక ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి చూసిన టెన్షన్ లోనే అలా స్పృహ తప్పి పడిపోయారా అనేది తెలియాల్సి ఉంది. ఇక గత కొద్ది రోజులుగా గోవిందకీ తన భార్యకి మధ్య గొడవలు జరుగుతున్నట్టు విడాకులు కూడా తీసుకుంటున్నట్టు వార్తలు వినిపించాయి.
ముఖ్యంగా గోవింద ఓ మరాఠీ నటితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే గోవింద కి , తన భార్యకి మధ్య గొడవలు అవుతున్నట్టు బీ టౌన్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కూడా గోవింద భార్య సునీత నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే గోవింద నాకు భర్తగా అస్సలు వద్దు అని,ఒక మంచి సోదరుడు..మంచి తండ్రి అయినప్పటికీ..మంచి భర్త కాలేకపోయాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు తన భర్తకి ఎవరితోనో ఎఫైర్ ఉందని,కానీ దాన్ని గ్రహించడానికి 38 సంవత్సరాల సమయం పట్టిందని, అయితే ఆమె మరాఠీ నటి అని తెలుసు కానీ ఇప్పటివరకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోకపోవడం వల్ల దాన్ని నేను నిర్ధారించలేను అంటూ చెప్పుకొచ్చింది. ఇక సునీత మాట్లాడిన మాటలు గోవిందా సునీత విడాకుల వార్తలకు మరింత ఆజ్యం పోసినట్టు అయింది. అయితే తాజాగా గోవిందా హాస్పిటల్ లో జాయిన్ అవ్వడంతో ఆయన త్వరగా కోలుకొని ఇంటికి రావాలని సునీత కోరుకుంది.