• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ ఇంటి కోసం 20 ఏళ్లు...

ఆ ఇంటి కోసం 20 ఏళ్లు కష్టపడ్డ స్టార్‌ హీరో

| ఒకప్పుడు హీరోల పారితోషికాలు చాలా తక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు స్టార్‌డమ్‌ ను బట్టి పారితోషికం ఉంటుంది

By - Tupaki Desk
Update: 2024-07-09 11:30 GMT

ఒకప్పుడు హీరోల పారితోషికాలు చాలా తక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు స్టార్‌డమ్‌ ను బట్టి పారితోషికం ఉంటుంది. వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్న హీరోలు కూడా ఉన్నారు. తమిళ స్టార్‌ హీరో ధనుష్ ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ ఉంటాడు. ఆ మూడు నాలుగు సినిమాలకు కలిపి దాదాపుగా వంద కోట్ల పారితోషికం అందుకుంటాడు అనే టాక్‌ ఉంది.

చెన్నైలోని అత్యంత ఖరీదైన ఏరియా అయిన పోయేస్‌ గార్డెన్ లో ధనుష్ ఇటీవల ఇల్లు కట్టించుకున్నాడు. తాజాగా తన స్వీయ దర్శకత్వంలో రూపొందిన రాయన్‌ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో పోయేస్‌ గార్డెన్‌ ఇల్లు గురించి ధనుష్ మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

ధనుష్ మాట్లాడుతూ... చిన్నప్పటి నుంచి పోయెస్ గార్డెన్ లో ఉన్న రజినీకాంత్ గారి ఇంటిని చూడాలని కోరిక ఉండేది. ఆ సమయంలోనే పోయెస్ గార్డెన్ లో ఒక చిన్న ఇల్లు అయినా నాకు ఉంటే బాగుంటుంది అనుకున్నాను. 16 ఏళ్ల వయసులో తుల్లువదో ఇళ్లమై అనే సినిమాలో నటించాను. ఆ సినిమా హిట్‌ కాకుంటే ఇప్పుడు ఎక్కడ ఉండేవాడినో నాకే తెలియదు.

20 ఏళ్ల తర్వాత నేను కోరుకున్నట్లుగా పోయెస్ గార్డెన్ లో ఇల్లు కట్టుకున్నాను. నా 20 ఏళ్ల కఠోర శ్రమకు ఇది ప్రతిఫలం అని నాకు బాగా తెలుసు. ఈ శ్రమలో నా సన్నిహితులు అభిమానుల సహకారం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉంటాను. నా అభిమానులు నాకు మద్దతుగా నిలవడం వల్లే ఈ స్థాయిలో ఉన్నాను అన్నాడు.

రాయన్‌ సినిమా తో మరోసారి ధనుష్ విశ్వరూపం చూడబోతున్నామని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. జూలై 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ధనుష్ లుక్ కి ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. తప్పకుండా ఈ సినిమా ఆయన స్థాయిని మరింతగా పెంచడం ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.

Tags:    
  • Dhanush 
  • Rayanmovie 
  • Sunpictures 
  • Poesgarden 
  • Rajinikanth 
  • Filmindustry 
  • Dhanushhouse 
  • Poesgardenhouse 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS