• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శేఖర్ గారి నమ్మకం...

శేఖర్ గారి నమ్మకం చూస్తుంటే భయంగా ఉంది: ధనుష్

| కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. కుబేర మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-06-16 05:02 GMT

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. కుబేర మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఆ సినిమాలో ధనుష్ తో పాటు సీనియర్ హీరో నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా లీడ్ రోల్స్ లో కనిపించనున్నారు.

ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. మేకర్స్ రిలీజ్ చేసిన పోయిరా మామ, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో టాప్ ట్రెండింగ్ ఉన్నాయి. టీజర్ మంచి బజ్ క్రియేట్ చేయగా.. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతోంది.

జూన్ 20న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా కుబేర విడుదల కానుండగా.. మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరైన ఆ వేడుకకు ధనుష్ కూడా వచ్చారు. శేఖర్ కమ్ముల సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారని, హెల్త్ ను కూడా లెక్క చేయకుండా కష్టపడ్డారని ధనుష్ చెప్పారు.

అందుకే ఆయన విషయంలో తాను చాలా కంగారు పడ్డట్టు తెలిపారు. కుబేర తనకు 52వ తమిళ్ సినిమా, రెండో తెలుగు సినిమా అని తెలిపారు. అయితే సార్ మూవీకి ముందే డైరెక్టర్ తనకు కుబేర కథ చెప్పినట్లు వెల్లడించారు. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉందని, అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు.

నాగార్జున సర్ తో వర్క్ చేయడం ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అని ధనుష్ తెలిపారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నట్లు చెప్పారు. నాగ్ సర్ మూవీలు చూస్తూ పెరిగానని, ఇప్పుడు ఆయనతోనే స్క్రీన్ షేర్ చేసుకోవడం మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. రష్మిక హార్డ్ వర్క్ చేసి ఈ స్థాయికి వచ్చిందని ప్రశంసించారు.

నిర్మాతలకు చాలా థ్యాంక్స్ అని, వారు లేకపోతే మూవీ లేదని అన్నారు ధనుష్. కుబేర స్పెషల్ ఫిల్మ్ గా చెప్పారు. శేఖర్‌ కమ్ములకు ఉన్న నమ్మకం చూస్తుంటే తనకు భయంగా ఉందన్నారు. AV చూస్తున్నప్పుడు నాన్న గుర్తు కొచ్చారని, తమను ప్రయోజకులను చేయడానికి ఎంతగానో కష్టపడ్డారని గుర్తు చేసుకున్నారు. ఈరోజు తాను ఇక్కడ ఇక్కడ ఉండటానికి కారణం ఆయన కష్టమని చెప్పారు. నాన్నకు కృతజ్ఞతలు చెప్పే అవకాశాన్ని ఈ వేదిక కల్పించినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

చాలా మాట్లాడాలి అనుకున్నాను కానీ... ఏవీ చూసాక మా నాన్న గుర్తుకొచ్చారు...

ఆయన ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచారు...

- #Dhanush #Kuberaa #KuberaaPreReleaseEvent #SekharKammulasKuberaa #Kollywood #Tupaki pic.twitter.com/iCXPqBDcCK

— Tupaki (@tupaki_official) June 16, 2025
Tags:    
  • Kuberaa 
  • Dhanush 
  • SekharKammula 
  • RashmikaMandanna 
  • Nagarjuna 
  • KuberaPreRelease 
  • KuberaaTrailer 
  • KuberaaSongs 
  • PanIndiaFilm 
  • Tollywood 
  • Kollywood 
  • Filmindustry 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS