ధనుష్‌కు అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలిందా?
ధనుష్ తమిళ హీరో. తనకు అక్కడ మంచి మార్కెట్ ఉంది. అయితే విచిత్రం ఏంటంటే తమిళ హీరో చేసినా ఈ సినిమాని అక్కడి ప్రేక్షకులు పెద్దగా ఆదరించడం లేదు.;
ధనుష్ కథానాయకుడిగా నటించిన మూవీ 'కుబేర'. తెలుగులో తనకిది రెండవ సినిమా. 'సార్' తరువాత ధనుష్ తెలుగులో చేసిన రెండవ సినిమా ఇది. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో సునీల్ నారంగ్ నిర్మించిన ఈ మూవీ రీసెంట్‌గా విడుదలై మంచి టాక్‌తో విజయవంతంగా రన్ అవుతున్న విషయం తెలిసిందే. కింగ్ నాగార్జున, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని పాన్ ఇండియా సినిమాగా భారీ స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు.
వంద కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా తొలి రోజు ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా రూ.30 కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఐదు రోజులకు గానూ రూ.71.90 కోట్లు వసూలు చేసింది. రిలీజ్‌కు ముందు నుంచి భారీ అంచనాలు నెలకొనడంతో ఈ సినిమా ఖచ్చితంగా పాన్ ఇండియా వైడ్‌గా సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని అంతా భావించారు. కానీ రిలీజ్ తరువాత లెక్కలు మారిపోతున్నాయి. ఒక్క తెలుగులో తప్ప మరే భాషలోనూ 'కుబేర'కు ఆదరణ లభించడం లేదు.
ధనుష్ తమిళ హీరో. తనకు అక్కడ మంచి మార్కెట్ ఉంది. అయితే విచిత్రం ఏంటంటే తమిళ హీరో చేసినా ఈ సినిమాని అక్కడి ప్రేక్షకులు పెద్దగా ఆదరించడం లేదు. దీంతో అక్కడ 'కుబేర'కు గట్టి షాక్ తగిలే అవకాశం ఉందని, వసూళ్లు చాలా వరకు తగ్గుతాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ టాక్‌తో షాక్‌లో ఉన్న 'కుబేర' టీమ్‌కు తాజాగా మరో షాక్ తగిలింది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకులు షాక్ ఇచ్చారు.
హిందీ బెల్ట్‌లో 'కుబేర' మండ్ వసూళ్లు భారీగా తగ్గిపోయాయి. ఐదు రోజుల్లో ఈ సినిమా అక్కడ వసూలు చేసిన మొత్తం రూ.1.25 లక్షలే. హిందీ ప్రేక్షకులకు ధనుష్, రష్మిక మందన్న, నాగార్జున సుపరిచితులే అయినా కాన్సెప్ట్ వారికి ఎద్దగా ఎక్కలేదని, ఆ ఆకరణంగానే కలెక్షన్స్ రోజు రోజుకీ అక్కడ డ్రాప్ అవుతున్నాయిని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతే కాకుండా ఆమీర్‌ఖాన్ నటించి, నిర్మించిన 'సితారే జమీన్‌పర్' కూడా అదే రోజు రిలీజ్ కావడం, దానికి పాజిటివ్ టాక్ రావడం 'కుబేర'పై ప్రభావాన్ని చూపిస్తోందని ఇన్ సైడ్ టాక్.