'కుబేర' నాన్ థియేట్రికల్ రైట్స్‌కు బిగ్ ఆఫర్!
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల్ని రూ.50 కోట్లు చెల్లించి దక్కించుకుందని తెలిసింది.;
'రాయన్'తో దర్శకుడిగా, హీరోగా డబుల్ విక్టరీని దక్కించుకున్న ధనుష్ ఈ సినిమాతో వంద కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. హీరోగానే కాకుండా దర్శకుడిగానూ ఫుల్ జోష్ మీదున్న ధనుష్ న్యూ ఏజ్ ఫిల్మ్ 'నిలవకు ఎన్ మేల్ ఎన్నాడి కోబం' సినిమాతో దర్శకుడిగా మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే మూవీని తెలుగులో 'జాబిలమ్మ నీకు అంత కోపమా' పేరుతో రిలీజ్ చేయడం ఇందులోని 'గోల్డెన్ స్పారో' సాంగ్ పాపులర్ కావడం తెలిసిందే.
ఇదే ఊపులో ధనుఫ్ తెలుగులో 'కుబేర' మూవీ చేస్తున్నాడు. 'సార్' సక్సెస్ తరువాత ధనుష్ చేస్తున్న రెండవ తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. సెన్నిబుల్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల పాన్ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. వరు బ్లాక్ బస్టర్లని దక్కించుకుంటూ యమ బిజీగా ఉన్న రష్మిక మందన్న ఇందులో ధనుష్‌కు జోడీగా నటిస్తోంది. కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండటం, ధనుష్ బిచ్చగాడి పాత్రని పోషిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళ భాషల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటికే విడుదల చేసిన ధనుష్ బెగ్గర్ లుక్, మూడు భాషల్లో విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఓ బిచ్చగాడికి ఓ బలమైన వ్యక్తికి మధ్య సాగే ఆసక్తికరమైన కథగా ఈ మూవీని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అంచనాలు తారా స్థాయికి చేరుకున్న ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ధనుష్‌తో కలిసి తొలిసారి కింగ్ నాగార్జున, రష్మిక నటించిన సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై డిమాండ్ ఏర్పడింది.
ఆ డిమాండ్‌కు తగ్గట్టే ఈ మూవీ నాన్ థిమయేట్రికల్ ఓటీటీ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడు పోయినట్టుగా తెలిసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల్ని రూ.50 కోట్లు చెల్లించి దక్కించుకుందని తెలిసింది. తెలుగు, తమిళంతో సహా ఐదుభాషలకు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కుల్ని ఈ మొత్తానికి సొంతం చేసుకుందని ఇన్ సైడ్ టాక్. ఈ మూవీని పాన్ ఇండియా వైడ్‌గా మేకర్స్ 20న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది.